ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2023 (14:47 IST)

'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

guntur kaaram
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "గుంటూరు కారం". ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, ఈ పాట ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ పాట పూర్తి లిరికల్‌ను విడుదల చేయనున్నారు. 
 
"దమ్ మసాలా బిర్యానీ.. గుద్దిపారేయ్ గుంటూర్నీ..." అంటూ ఎంతో ఎనర్జిటిక్‌గా సాగే గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీత సమకూర్చుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు.