కొత్త గెటప్ ఎలా వుందంటున్న మహేష్‌బాబు
సూపర్ స్టార్ మహేష్‌బాబు సూట్‌వేసుకుని సూట్ చెక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాబూ... నువ్వు ఏది వేసినా సూపర్‌గా వుంటుందని చాలామంది స్పందించారు. ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. పనిలో పనిగా వాణిజ్య ప్రకటలను కూడా ఆరంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సూట్ దేనికి వేసుకున్నాడనేది అభిమానులకు పజిల్‌గా వదిలేశాడు.
అయితే, టాటా న్యూ బ్రాండ్ సేల్ అంటూ ఓ వీడియో కూడా ఆయన ట్విట్టర్‌లో వుంది. ఓ అభిమాని పెట్టి దానికి మహేష్‌బాబు వాణిజ్యప్రకటన చేస్తున్నాడా! అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అక్టోబర్ 10 నుంచి 10 వరకు ఈ షూట్ జరుగుతుందని తెలుస్తోంది. కనుక చెక్ సూట్ అంటూ తను ఫోటొ పెట్టి అభిమానులను అలరించారు. ఈ సూట్ నమ్రత ఎంపిక చేసిందని తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా తుదిమెరుగులు దిద్దుకుంటోంది. టైటిల్ కాస్త భిన్నంగా వున్నా ఫ్యాన్స్‌లో కాస్త కన్‌ప్యూజ్ క్రియేట్ చేసినా ఈ సినిమా మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాను మహేష్ వ్యక్తం చేస్తున్నాడు.