మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (16:28 IST)

ఊహించని మలుపులతో ఏ చోట నువ్వున్నా సినిమా తీసాం : నిర్మాతలు

Mandalapu Srinivasa Rao, Medikonda Srinivasa Rao
Mandalapu Srinivasa Rao, Medikonda Srinivasa Rao
నూతన నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు మేడికొండ శ్రీనివాసరావు సంయుక్త గా ఎమ్. ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  పసలపూడి ఎస్.వి దర్శకత్వంలో లో నిర్మించిన చిత్రం "ఏ చోట నువ్వున్నా". నూతన నటీనటులు ప్రశాంత్, అంబికా ముల్తానీ హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా నిర్మాతలు సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
మాది ఒకరిది గుంటూరు జిల్లా  బోదిలవీడు గ్రామం. ఇంకొకరిది ప్రకాశం జిల్లా పుల్లలచెరువు గ్రామం. చిన్ననాటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. ప్రస్తుతం వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగులం. సినిమా నిర్మించాలి అని ఆలోచన ఎలా వచ్చింది అంటే కరోనా టైమ్ లో ఓ.టి.టి లో కొన్ని మంచి చిత్రాలు చూసినప్పుడు మనం కూడా ఓ. టి. టి కి మంచి కథ తో కూడిన చిత్రాన్ని నిర్మించాలి అనే ఆలోచన పుట్టింది. ఈ విషయాన్ని సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న మా స్నేహితుడు శ్రీ చౌదరితో చెప్పడం, తన ద్వారా దర్శకుడు పసలపూడి ఎస్. వి పరిచయం అవ్వడంతో ఈ చిత్రానికి నాంది పడింది.
 
దర్శకుడు పసలపూడి ఎస్.వి కథ చెప్పినపుడు చాలా మంచి కథ అనిపించింది. వెంటనే సినిమా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ చిత్రాన్నికి సంబంధించిన నటీనటులు కోసం రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించి అందరూ కొత్తవాళ్ళని సెలక్షన్ చేసుకున్నాం.
 
ఈ చిత్రం హీరో హీరోయిన్ ప్రశాంత్ అంబికా ముల్తానీల నటన చాలా సహజంగా పల్లెటూరిలో మన పక్కింట్లో వాళ్ళని చూసినట్టు ఉంటుంది. మిగిలిన నటి నటులు అందరూ కథకు న్యాయం చేశారు.
 
ఈ చిత్రానికి తరుణ్ రాణా ప్రతాప్ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. చిత్రంలో రెండు పాటలు ప్రేక్షకుల మన్ననలు పొందుతాయి. మా చిత్రాన్ని కి డి.ఓ.పిగా చేసిన శ్రీకాంత్ మార్క అనిల్ పీజీ రాజ్ పల్లెటూరు అందాలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఎడిటర్ శ్రీవర్కల కూర్పు చాలా బాగుంది. మా చిత్రానికి కథ - మాటలు కుమార్ పిచ్చుక అందించారు. కథతోపాటు మాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
 
పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. దర్శకుడు ఎస్.వి చిత్రం ముగింపుని చాలా కొత్తగా చిత్రీకరించారు. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుంతుందనే నమ్మకంతో ఉన్నాం. నిర్మాతలగా మాకు మంచి శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వైజాగ్ శంకర్ గారి సారధ్యంలో ఈ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. సినిమా మేకింగ్ అంటే మాకు చాలా ప్యాషన్. ఈ రంగంలో కలిసే కొనసాగుతాం. కచ్చితంగా మంచి మేకర్స్ గా పేరు సంపాదించు కుంటాం అన్నారు.