ఎనభై వసంతాల కె. రాఘవేంద్ర రావు రాసిన ప్రేమలేఖ విశేషాలు
K. Raghavendra Rao, Chiranjeevi
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు నేటితో 80 సంవత్సరాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. శత వసంతాలు ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండేలా ఆశీర్వదించమని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.
కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన సినిమాలతో అనేక మంది హీరో, హీరోయిన్లకు సక్సెస్ ఇచ్చారు. హీరోయిన్ల అందాలను సినిమాటిక్‌గా చూపించడం ఆయన శైలి. ఆయన సినిమాల్లో ఒక్కసారైనా నటించాలని చాలామంది అనుకునేవారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, అన్నమయ్య వంటి భక్తిరస చిత్రాలు తీసి మెప్పించారు. ఆ తర్వాత తిరులమ తిరుపతి దేవస్థానం ఛానల్‌కు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇప్పడు తాజాగా 80 ఏళ్ళ అనుభవాలను ఓ పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అనే పేరుతో వచ్చిన ఈ పుస్తకాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు జస్టిస్. ఎల్.వి. రమణ ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో చాలా విషయాలను ఆయన ఆవిష్కరించారు. త్వరలో దీని గురించి ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారం చేయనున్నట్లు ఈరోజే ఆయన తెలిపారు. అప్పుడు 1963వ సంవత్సరం. ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున పాండవ వనవాసం చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌పై తొలిసారి క్లాప్ కొట్టడంతో నా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు నాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. పదేళ్ల పాటు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.ఎస్ ప్రకాశ్‌రావు గారు అందించిన బాబు (1975) చిత్రంతో దర్శకునిగా సినిమా ప్రయాణం. ఆ రోజు నుంచి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులు అవార్డులు, రివార్డులు ఎన్నిచూసుంటాను. అంటూ హీరోయిన్ల గురించి, నేడు కొత్తగా చేస్తున్న ఈ సినిమా పర్యేవక్షణ గురించి వివరించారు.