గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 జనవరి 2025 (21:24 IST)

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

Charan- Pawan
Charan- Pawan
Game changer Pre-release రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. ఈ వేడుకకు ఎ.పి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ, మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారని దర్శకుడుశంకర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
 
Pawan, charan Entry
Pawan, charan Entry
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సినిమా ఫంక్షన్ చేయాలంటే భయపడేవాడిని. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. తొక్కిసలాటలతో హీరోల చూడకుండా తిరిగి వెళ్ళాలి. టికెట్ రేటు ఎందుకు పెంచాలంటే... డిమాండ్ అండ్ సప్లయి. శంకర్ గారి సినిమా అప్పట్లో బ్లాక్ లో కొని చూశా. బడ్జెట్ పెరిగిపోయి, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా వెళుతోంది. మార్కెట్ పెరిగింది. పెరిగిన రూపాయికు టాక్స్ కడుతున్నాం. బయట ఫాల్స్ ఆలోచనలు వున్నాయి. నేను భీమ్లానాయక్ కు పెంచలేదు. చాలా మంది కూటమికి మద్దతు చెప్పలేదు. సినిమాకు రాజకీయ రంగు పులవడం ఇష్టం లేదు.

చిన్నపాటి పెన్సిల్ తయారీకి ఎంతోమంది దేశాల వారూ కలిసిరావాలి. అలాగే సినిమా కూడా. అందరూ కలిసి ఆహ్లాదం కలిగిస్తారు. భారత చిత్ర పరిశ్రమ అనాలి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎందుకు అంటారు. హాలీవుడ్ తరహా స్కిల్ ఫాలో అవుదాం. కానీ ఇప్పుడు మనదైన కథతో ఫాలోఅయి అందరికీ చూపించాలి. చిత్రపరిశ్రమలో డిసిప్లెన్ రావాలి. సినిమాలు తీసేవారు మాట్లాడాలి. 
 
సినిమా టికెట్ల పెంపుకు హీరోలు ఎందుకు? నిర్మాతలు రండి. హీరోలు వచ్చి నమస్కారం పెట్టాలి అనుకునే లోలెవల్ వ్యక్తులము కాము. మేం ఎన్.టి.ఆర్. నుంచి నేర్చుకున్నాం. పెరిగిన టికెట్ రేటు కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
 
సినిమా అభిమానులకూ, సినీ హీరో అభిమానులకూ, రామ్ చరణ్ అభిమానులకూ హృదయపూర్వక నమస్కారాలు. మనం ఎక్కడనుంచి వచ్చామో మర్చిపోకూడదు. రఘుపతి వెంకయ్యనాయుడు, దాదా సాహేబ్, షోలే తీసిన వారిని మర్చిపోలేం. నాగి రెడ్డి, బి.ఎన్. రెడ్డి, గూడపల్లి రామబ్రహ్మంను మర్చిపోలేం. శంకర్, ఎస్.జె.సూర్య ను మర్చిపోలేం. తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్.టి.ఆర్.కు మనస్సూర్తిగా తలచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే. మారుమూల మొగల్తూర్ గ్రామంలో చదువుతూ .. ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓ.జి. అనండి ఆయనే ఆధ్యుడు. తెలుగు సినిమా రంగం వచ్చిందంటే నాగేశ్వరరావు ఇలా ఎంతో మంది శక్తియుక్తులు దారపోశారు. 
 
ఈ వేదికపై సినిమా ఫంక్షన్ చేసుకుంటున్నామంటే కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారిని ఆశీస్సులు నిరంతర మద్దతు వుంది. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. హోం మంత్రి అనితకు ధన్యవాదాలు. 
 
శంకర్ గారి సినిమా జంటిల్ మెన్ నేను థియేటర్ లో చూశాను. యాక్టర్ అవ్వాలనే ఆలోచన వుందో లేదో టైంలో చూశాను. ప్రేమికుడు సినిమాకు తోడు లేక అమ్మమ్మతో చూశా. అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునే సినిమా. సోషల్ మెసేజ్‌లు ఆయనవి. భారత్ దేశంలో చరణ్, ఎన్.టి.ఆర్.లు ప్రపంచ ఖ్యాతి తెప్పించిన దర్శకుల్లో శంకర్ ఒకరు. తమిళ సినిమా అయినా డబ్ అయి శంకర్ సినిమా అనగానే ఆదరించేవారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్‌తో తెలుగులో తీశారు. 
దిల్ రాజు తొలిప్రేమ టైంలో పంపిణీదారుడు. ఇది సూపర్ హిట్ అని నమ్మకంతో చెప్పా.

నేను కష్టాల్లో వున్నప్పుడు పేరుంది డబ్బులు లేవు. ఆ టైంలో వకీల్ సాబ్ సినిమా నాతో తీశారు. అది జనసేన పార్టీకి ఊతం ఇచ్చింది. రామ్ చరణ్ పుట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. అప్పుడు పేరు రాముడు భక్తుడిగా ఆంజనేయస్వామి పేరుతో అనుకున్నాం. అందుకే రామ్ చరణ్ పెట్టారు. నాకు అన్న, వదిన మాత్రుసమానులు. రామ్ చరణ్ లో శక్తి సమర్థత వుందని తెలీదు. ఎప్పుడూ డాన్స్ వేయడం చూడలేదు. కానీ అద్భుతమైన డాన్సర్. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చూశాక అవార్డ్ రావాలనుకున్నా. భవిష్యత్ లో మరిన్ని అవార్డులు రావాలని కోరుకున్నా. చిరంజీవి గారికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్లార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. 
 
సంకల్ప బలం వుంటే ప్రతి ఒక్కరూ మెగాస్టార్ లా ఎదగగలరు. చిరంజీవిగారు ఎంత కష్టపడేవారంటే రాగానే అలసి సొలిసి వచ్చేవారు. షూటింగ్ లో గాయాలు కూడా అయి వచ్చేవారు. అప్పట్లో సేఫ్టీ లేని రోజులు. ఆయన రాగానే షూస్ లు తీసి పాదాలు తుడిచేవాడిని. అప్పుడు నాకు ఉపశమనం కలిగేది. నేను దీనిని అహంకారంగా తీసుకోను. 
 
ఇక్కడ అందరి అభిమానులున్నారు. అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు. ప్రభాస్ ను ఇష్టపడతారు. మహేష్ గారు ఇలాఅందరి హీరోలను ప్రజలు ఇష్టపడతారు. నానిగారి సినిమాలు మా సిస్టర్ కు బాగా నచ్చుతారు. హీరోను ద్వేషించే పని చిరంజీవిగారు చెప్పలేదు. ఈ హీరో సినిమా పోవాలి అనే పద్ధతి లేదు. సర్వేజన సుఖినోభవంతు అని నేర్పారు. అలాంటి వాతావరణంలో పెరిగిన రామ్ చరణ్ నాకు గర్వంగా వుంటుంది. హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయ వేసేది. నేను మగధీర చూశాక నేను కూడా చేస్తే బాగుండేది. 
 
సినిమాలు విలువలు చెప్పాలి. చంద్రబాబునాయుడు చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. సినిమాలకు సరైన కథలు కావాలి. జీవిత కథలు కావాలి. 
 
దిల్ రాజు మాట్లాడుతూ, ఎ .పి. ప్రభుత్వం, దుర్గేష్ గారు సినిమా టికెట్ల పెంపుకు, బెనిఫిట్ షోలో ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
 
మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ,  ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా రంగానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తుందని మంత్రి దుర్గేశ్ ప్రకటించారు. సినిమారంగంలో గేమ్ ఛేంజర్ గా సినిమా నిలబడాలని ఆశిస్తున్నాను. తమన్ సంగీతానికి ప్రత్యేక ధన్యవాదాలు. నాలుగు కాలాలపాటు ఎ.పి.లో సినిపరిశ్రమ స్థిరపడాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, నేను తెలుగులో సినిమా తీయలేదు. అన్నీ డబ్ అయ్యాయి. బాగా ఆదరించారు. నేడు నేరుగా తెలుగు సినిమా తీశాను. దిల్ రాజు, రామ్ చరణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్ర కథ ఏమంటే, కలెక్టర్ కూ, పొలిటీషన్ కు మధ్య జరిగేవారే సినిమా. రెండు పాత్రల్లో రామ్ చరణ్ చాలా రియలిస్టిక్ గా చేశారు.
 
రాజమండ్రి బ్రిడ్జిపై పవన్ కల్యాణ్ గారు ర్యాలీ చేస్తే ఈరోజులాగే ప్రజలు వచ్చారు. వపన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్ లో వచ్చినందుకు థ్యాంక్స్. సినిమా టైటిల్ శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలీదుకానీ. తెరపై పాత్ర అది. నిజజీవితంలో ఇండియన్ పాలిటిక్స్ ను ఛేంజ్ చేసిన వారు పవన్ కళ్యాన్ గారే. జనాలకోసం తపన చూశాను. శంకర్ గారు నిజజీవితంలో పవన్ లాంటి వ్యక్తులను చూసి గేమ్ ఛేంజర్ కథ రాశారు.