సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (13:07 IST)

షాకింగ్ న్యూస్- ప్ర‌భాస్ రావ‌ణుడిగా న‌టిస్తున్నాడా..?

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రామాయణం చిత్రాన్ని నిర్మించనున్న‌ట్టు ఇటీవ‌ల అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇందులో రాముడు పాత్ర ఎవ‌రు పోషిస్తారు...? రావ‌ణుడి పాత్ర ఎవ‌రు పోషిస్తారు..? ఇక సీత పాత్ర ఎవ‌రు పోషిస్తారు..? ఇలా అనేక ప్ర‌శ్న‌లు.
 
ఇందులో రాముడి పాత్రలో హృతిక్ రోషన్ నటించనుండగా, సీత పాత్ర కోసం దీపికా పదుకొనేను తీసుకున్నారని తెలిసింది. దీంతో ఈ ప్రాజెక్ట్ కి భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయ‌నున్నారో త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
అది ఏంటంటే...?  ఇక మరొక కీలకమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. సాహో సినిమాతో ప్రభాస్ హిందీ ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ పొందాడు కాబట్టి బిజినెస్ పరంగా కూడా వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారట. 
 
మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు సెట్టవుతుందో చూడాలి.  మూడు బాగాలుగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దర్శకులు నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ తెరకెక్కించనున్నారు. 2021లో ఇందులోని మొదటి భాగం విడుద‌ల చేయ‌నున్నారు.