శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:11 IST)

సాహో రెండు వారాల్లో ఎంత క‌లెక్ట్ చేసాడో తెలుసా..?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన సంచ‌ల‌న చిత్రం సాహో. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌ఫూర్ న‌టించింది. ఈ భారీ క్రేజీ మూవీకి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ  తొలి రోజు నుండి మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పైన అత్యంత భారీ వ్యయంతో మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో విశేషంగా ఆక‌ట్టుకోవ‌డం విశేషం.
 
ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 424 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్‌ను సాధించినట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది. 
 
ఇక ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సాహో సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తూ మూడో వారంలోకి ప్రవేశించింది. నెగిటివ్ టాక్ వ‌చ్చినా 424 కోట్లు వ‌సూలు చేయ‌డం అంటే మాట‌లు కాదు. దీనిని బ‌ట్టి ప్ర‌భాస్‌కి ఎంత‌టి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.