గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మే 2022 (19:01 IST)

'ఎఫ్ 3' కలెక్షన్లు కుమ్మేస్తున్నాయిగా.. నాలుగు రోజుల్లో..?

f3
f3
ఎఫ్3 సినిమా యూనిట్ ఫుల్ ఖుషీలో వుంది. వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమా రూపొందింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. 
 
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 4 రోజులలో మంచి వసూళ్లను సాధించింది. వీకెండ్‌తో పాటు సోమవారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. సోమవారం ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో 4.64 కోట్లను వసూలు చేసింది. ఈ నాలుగు రోజుల మొత్తంగా చూసుకుంటే 32.11 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఓవర్సీస్ విషయానికి వస్తే 2.3 మిలియన్ వసూళ్లను సాధించింది.
 
ఎఫ్ 3లో కామెడీని బాగా పండించాడు అనిల్ రావిపూడి. కామెడీ వైపు నుంచి సునీల్ .. అలీని కొత్తగా తీసుకున్నాడు. ఇక గ్లామర్ వైపు నుంచి సోనాల్ చౌహాన్, పూజా హెగ్డేను తీసుకున్నాడు. మొత్తం సినిమా ఫుల్ మస్తుగా తెరకెక్కింది. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. తద్వారా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.