ఎఫ్3 సెకండ్ సింగిల్ ప్రోమో వైరల్

బుధవారం, 20 ఏప్రియల్ 2022 (20:33 IST)
F 3 new poster
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్  మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  'F3' థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌ లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాటని విడుదల చేయనుంది.
 
తాజాగా 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. కలర్ఫుల్ అండ్ గ్లామరస్ గా డిజైన్ చేసిన ఈ ప్రోమో క్షణాల్లో వైరల్ గా మారింది. విడుదల చేసిన కొద్దిసేపటికే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ..ఈ ప్రోమోలో జోష్ ఫుల్ మాసీ డ్యాన్సులతో సందడి చేస్తూ కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట కోసం మరో చార్ట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతుంది. ప్రోమో చివర్లో సునీల్ తన ట్రేడ్ మార్క్ స్టెప్ తో కనిపించడం పాటపై ఇంకా ఆసక్తిని పెంచింది. ఏప్రిల్ 22న పూర్తి పాటని చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది.

అన్నీ చూడండి

దక్షిణ తీర కొత్త రైల్వే జోన్‌... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్

పవన్ గారూ... మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కిందకి నీళ్లు రాకుండా చూస్కోండి: కవిత ఎగతాళి

పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ

అదృశ్యమైన 11 గంటల్లోనే నాలుగేళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

అన్నీ చూడండి

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

తర్వాతి కథనం
Show comments