మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (11:00 IST)

కండోమ్‌లను ప్రమోట్ చేసే నుష్రత్ బరుచా.. ట్రోల్స్ మొదలు

actress
actress
బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'జన్ హిత్ మే జారీ'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమెకు నెగెటివ్ కామెంట్స్ ఎదురవుతుండగా, వాటికి తనదైన శైలిలో సమాధానాలిస్తోంది.
 
'జన్ హిత్ మే జారీ' పిక్చర్ ట్రైలర్ రిలీజ్ కూడా అయింది. అయితే, ఈ సినిమా స్టోరిలో భాగంగా నటి నుష్రత్ బరుచా కండోమ్‌లను ప్రమోట్ చేసే వ్యక్తిగా కనబడుతుంది. 
 
స్టోరి లైన్ కూడా కండోమ్ ప్రమోషన్ మీదనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు నుష్రత్ బరుచాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆ కామెంట్స్ కు తను భయపడబోనని, ఇటువంటి టాపిక్ పై సినిమా తీయడానికి ధైర్యం కావాలని అది తనకు ఉందని స్పష్టం చేసింది.
 
'జన్ హిత్ మే జారీ' పిక్చర్ ఈ ఏడాది జూలై 10న విడుదల కానుంది. డెఫినెట్ గా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.