శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (13:27 IST)

ఉచిత మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్లను మంటల్లో తగలబెడుతున్న హీరో ఫ్యాన్స్...

తమిళ హీరో విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'సర్కార్'. ఈ చిత్రం నవంబర్ 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మేరకు గ్రాస్ వసూళ్లను సాధించిపెట్టింది. 
 
అదేసమయంలో పెను వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా, తమిళనాడులోని అధికార మాజీ ముఖ్యమంత్రి జయలలితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించింది. దీంతో అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. ఫలితంగా ఈ చిత్రాన్ని రీ సెన్సార్ చేసి, వివాదాస్పద డైలాగులు, సన్నివేశాలను తొలగించారు. 
 
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే శ్రేణులు పాల్పడిన చర్యలపై విజ‌య్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా 'సపోర్ట్‌ విజయ్' అనే హ్యాష్‌టాగ్‌తో త‌మ అభిప్రాయాల‌ని తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు అభిమానులు త‌మ ఇంట్లో ఉన్న ఉచిత మిక్సీ, గ్రైండర్లను పగలగొడుతూ వినూత్న నిర‌స‌నకు దిగుతున్నారు. 
 
మరికొందరు ఉచితంగా ఇచ్చిన వస్తువులను మంట‌ల్లో వేసి తగలబెడుతున్నారు. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొంద‌రు ఇలా చేయ‌డం స‌రికాదు అంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం సినిమాల‌ని రాజ‌కీయ కోణంలో అస్స‌లు చూడొద్దంటూ హితవు ప‌లుకుతున్నారు.