గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (17:44 IST)

కోమలవల్లిగా వరలక్ష్మి.. ఆ పేరే సర్కార్‌కు తలనొప్పి తెచ్చిపెట్టిందా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సర్కార్... దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ప్రతినాయకి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు.. దివంగత సీఎం జయలలిత ప్రతిష్ఠను దెబ్బతీసేవిగా వున్నాయని అన్నాడీఎంకే పార్టీ ఆరోపించింది. 
 
ఈ వివాదం కారణంగా కొన్ని చోట్ల ప్రదర్శనలు నిలిచిపోవడం, థియేటర్ల ధ్వంసం, మురుగదాస్‌పై కేసులు వంటి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వరలక్ష్మీ శరత్ కుమార్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలనీ, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని మురుగదాస్ నిర్ణయించుకున్నారు. ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 
 
ఇకపోతే.. తమిళనాడు సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని సంబంధం వుంది. గతంలో మెర్సల్ మూవీలో ఒక్క డైలాగ్ కారణంగా దేశమంతా లొల్లి చేశారు. తాజాగా విజయ్ తీసిన మరో సినిమా ''సర్కార్'' సైతం రాజకీయ వివాదానికి దొరికిపోయింది. ఇందులో.. వరలక్ష్మి శరత్ కుమార్ పోషించిన పాత్ర.. పురచ్చి తలైవి జయలలితను పోలి ఉండడమే గొడవకు ప్రధాన కారణమైంది. ఇందులో వరలక్ష్మి పేరు కోమలవల్లి. 
 
నిజానికి అన్నాడీఎంకే దివంగత అధినేత్రి జయలలిత మొదటి పేరు కూడా కోమలవెల్లి. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేముందు ఆమె జయలలితగా మారారు. అందుకే.. జయలలితను ఎంత అభిమానిస్తారో కోమలవెల్లి అనే పేరును కూడా అంతే ఆరాధిస్తారు. కోమలవల్లి పేరు పెట్టుకుని అడ్డమైన డైలాగులు చెప్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే పార్టీ నేతలు వరలక్ష్మికి వార్నింగ్ ఇచ్చారు. అందుకే ఇక చేసేది లేక మురుగదాస్ టీమ్ వరలక్ష్మీ చెప్పే డైలాగులకు కత్తెర వేయాలని భావిస్తోంది.