సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 8 నవంబరు 2018 (18:32 IST)

పెళ్ళి చేసుకుని ఏం చేయాలి.. ఒకే ముఖాన్ని చూడాలా.. సినీనటి వరలక్ష్మి

వివాహ వ్యవస్థపై సినీనటి వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్ళి చేసుకోవడం ఒక బోరింగ్ పనని, పెళ్ళి చేసుకొని ఏం చేయాలంటూ ప్రశ్నించింది. పెళ్ళి చేసుకోవడం అంటే అస్సలు నాకు ఇష్టం లేదు. పెళ్ళి చేసుకుంటే ఒకే వ్యక్తిని చూస్తూ ఉండాలే తప్ప వేరే ఉపయోగం లేదన్నారు. నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు. ప్రేమించినప్పుడు చూద్దాం. అప్పటివరకు పెళ్ళి గురించి ఎవరు మాట్లాడినా నాకు కోపమొస్తుందని చెబుతోంది వరలక్ష్మి.
 
విశాల్, తనకు మధ్య కొంతమంది చెడు ప్రచారం చేశారని, సామాజిక మాథ్యమాలే వేదికగా పుకార్లు పుట్టించాయని, అది తనను బాగా బాధించిందన్నారు. నేను ఎవరినైనా ప్రేమిస్తే అందరికీ చెబుతానంటోంది వరలక్ష్మి. ప్రేమించి పెళ్ళి చేసుకునే ఆలోచనలోనే ఎక్కువగా ఉన్నానని కూడా చెబుతోంది. పందెం కోడి-2, సర్కార్ సినిమాల తరువాత అవకాశాలు నాకు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ, పెళ్ళి నాకు అవసరమా అంటోంది వరలక్ష్మి.