"సర్కార్" సునామీ... జస్ట్ 2 డేస్.. రూ.200 కోట్లు కొల్లగొట్టింది...
తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రం దీపావళి పండుగకు (నవంబరు 6వ తేదీ) విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా, టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా కేవలం 2 రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు రూ.30 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.2.32కోట్లు, కేరళలో దాదాపు రూ.6 కోట్లను కలెక్ట్ చేసి.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్క్రీన్స్‌ప విడుదల చేశారు. ఇక ఈ చిత్రం "మెర్సెల్" రికార్డులను అధిగమించేట్టుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.