శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 మే 2024 (15:39 IST)

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

Aishwarya Rai
ఐశ్వర్యా రాయ్ కుడిచేతికి కట్టు వేసుకుని కనిపించడంతో ఆమె అభిమానులు షాక్ తిన్నారు. పొన్నియిన్ సెల్వన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఐకానిక్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కొత్త సినిమాలకు సంతకం చేయలేదు. ఐతే ఆమె ఎయిర్ పోర్టు దగ్గర చేతికి కట్టుతో కనిపించడం షాక్ కి గురి చేసింది.
 
ఐశ్వర్యా రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో పాటు గత రాత్రి కేన్స్‌కు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అయితే ఆమె చేతి గాయాన్ని చూసి అందరూ ఒకింత షాక్ అయ్యారు. ఐతే ఐశ్వర్య తన సంయమనాన్ని పాటిస్తూ ఎవరు ఏమి అడిగినా చెప్పడానికి నిరాకరించింది, దీనితో అభిమానులు ఆందోళన చెందారు. ఆ గాయంతో రెడ్ కార్పెట్ పైన ఎలా నడుస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
మరికొందరు అసలు ఐశ్వర్యా రాయ్ కి ఆ దెబ్బ ఎందుకు తగిలిందోనని ఆరా తీస్తున్నారు. కానీ వారి ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకలేదు.