Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇంజనీర్‌ను బెదిరించిన నటుడు బాబీసింహా.. కేసు నమోదు

Written By వరుణ్
Updated: బుధవారం, 20 సెప్టెంబరు 2023 (08:40 IST)
ఓ ఇంజినీర్‌ను బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు బాబీ సింహాతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దిండిగల్ జిల్లా కొడైకెనాల్‌ విల్‌పట్టి పంచాయతీలోని పేత్తుపారైలో నటుడు బాబీ సింహా కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. అనుమతి ఇచ్చినదానికంటే ఎక్కువ స్థలంలో నిర్మిస్తున్నారని ఆయనపై, అదే ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తున్న ప్రకాశ్‌రాజ్‌పై స్థానికులు ఫిర్యాదు చేశారు. 
 
ఇదిలావుంటే, బాబీ సింహాకు, కాంట్రాక్టర్‌ జమీర్‌కు గొడవలు జరగడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి. జమీర్‌కు బాబీ సింహా డబ్బులు ఇవ్వలేదని సమాచారం. దీంతో జమీర్‌ బంధువు ఇంజినీర్‌ అయిన హుస్సేన్‌ కొడైకెనాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
షణ్ముగనూర్‌లోని తన గెస్ట్‌హౌస్‌కు గత నెల 20న నటుడు బాబీసింహా, కేజీఎఫ్‌ సినిమాలో నటించిన రామచంద్రన్‌ రాజ్‌, మరో ఇద్దరు వచ్చి ఇల్లు నిర్మాణ విషయంలో తలదూర్చకూడదని బెదిరించినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో నటుడు బాబీసింహా, రామచంద్రన్‌రాజ్‌ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్టు : యువతి ఆత్మహత్య

ఏపీలో స్థానిక సమరం : నేడు మేయర్ స్థానాలపై కసరత్తు

అనగనగా ఓ బిచ్చగాడు... ఆయనకు 21 మంది భార్యలు.. ఎక్కడ?

పెళ్లయిన మూడో రోజే భర్త - అత్త మామల హత్యకు భోజనంలో విషం పెట్టిన భార్య

'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?

బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం

మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?

తర్వాతి కథనం
Show comments