బిగ్ బాస్ మూడో సీజన్.. గీతా మాధురి సపోర్ట్ ఎవరికో తెలుసా?
బిగ్ బాస్ మూడో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం విన్నర్ ఎవరో తేలిపోనుంది. టాప్ ఫైవ్‌లో వున్న వారిలో ఒకరు విజేతగా నిలువనున్నారు. ఈ క్రమంలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్ ఉన్నారు. అసలే షో దగ్గరపడడంతో వీరికి సపోర్ట్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు.
అందులో భాగంగా శ్రీముఖికి సపోర్ట్‌గా జబర్దస్త్ యాంకర్ రష్మీ ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాగా మరో టాప్ కంటెస్టెంట్ రాహుల్‌కు సపోర్ట్‌గా పాప్ సింగర్ నోయెల్ ప్రచారం చేస్తున్నాడు.
తాజాగా బిగ్ బాస్ రెండో సీజన్‌లో రన్నర్‌గా నిలచిన సింగర్ గీతా మాధురి కూడా హౌస్ లోని ఇద్దరికి మద్దతు ప్రకటించారు. అందులో భాగంగా ఆ ఇద్దరి పిక్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే హౌస్‌లో టాప్ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పిన గీతా మాధురి.. కేవలం శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌లతో దిగిన ఫొటోలను మాత్రమే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.