కేన్సర్ ట్రీట్మెంట్ ఎఫెక్టు : బక్కచిక్కి, నీరసంగా కనిపిస్తున్న సంజయ్

sanjay dutt
ఠాగూర్| Last Updated: సోమవారం, 5 అక్టోబరు 2020 (14:36 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ స్లిమ్‌గా తయారయ్యాడు. లంగ్ కేన్సర్ బారినపడిన సంజయ్... ప్రస్తుతం విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ముఖ్యంగా, ఈ కేన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజీలో ఉండడంతో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంజయ్‌ దత్‌ భార్య మాన్యతా దత్, పిల్లలు దుబాయ్‌లో ఉండటంతో ఇటీవల ఆయన కూడా దుబాయ్‌కి వెళ్లి వచ్చారు. అయితే, ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో ఫొటో తీసుకుంది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
sanjay dutt

సంజయ్‌ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో సంజయ్‌ దత్‌ ముఖంలో తేడాలు కనిపిస్తున్నాయి. ఆయన క‌ళ్లు లోప‌లికి పోయి ఉన్నాయి. మనిషి కూడా బాగా చిక్కి, నీరసంగా కనిపిస్తున్నారు. ఇలా సంజయ్‌ను చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆయనకు కేన్సర్ ఉందని తేలడంతో వాటిలో ఆయన నటించే విషయంపై సందిగ్ధత నెలకొంది. కన్నడ సినిమా 'కేజీఎఫ్‌-2'లోనూ సంజయ్ దత్ అత్యంత కీలకమైన పాత్రలో నటించాల్సివుంది.దీనిపై మరింత చదవండి :