సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సిహెచ్
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:43 IST)

వైరల్ వ్యాధులను అడ్డుకునే చిన్నివుల్లిపాయ పచ్చడి

ఇప్పుడు బయట ఆహార పదార్థాలను కొనుక్కోవాలంటే భయంగా వుంటుంది. ఎక్కడ కరోనావైరస్ వెంటబడుతుందోనని. అందుకే ఏదయినా ఇంట్లోనే చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అప్పటికప్పుడు హడావుడి పడేకంటే ముందుగా ఇంట్లోనే పచ్చళ్లు పట్టుకుంటే వేడివేడి అన్నంలో తినేయవచ్చు.
 
ఇప్పటి సీజన్లో బ్యాక్టీరియా, వైరస్ ద్వారా వ్యాపించే దగ్గు, జలుబు, చర్మ వ్యాధులు వస్తుంటాయి. వాటిని నయం చేయాలంటే వెల్లుల్లిని ఆహారంలో అధికంగా చేర్చుకుంటే సరిపోతుంది. వెల్లుల్లితో పచ్చడి చేసి తీసుకుంటుంటే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు.
 
కావలసిన వస్తువులు:
వెల్లుల్లిరేకులు - ఐదు కప్పులు.
కారం - 1 కప్పు
జీలకర్ర - 1 టీ స్పూను.
ఆవపిండి - అర కప్పు.
ఇంగువ - అర టీ స్పూను.
నిమ్మరసం - 1 కప్పు.
నువ్వులనూనె - 2 కప్పులు.
పసుపు - పావు టీ స్పూను.
ఉప్పు - ముప్పావు కప్పు.
మెంతిపొడి- పావుకప్పు.
 
తయారీ విధానం:
ముందుగా వెల్లుల్లి రేకుల్ని పొట్టు తీసి శుభ్రం చేయాలి. ఓ బాణలిలో నూనె వేసి వేడి చేసి ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రేకులు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం వేసి బాగా కలిపిన తరువాత మిగిలిన నువ్వుల నూనెను పచ్చడిమీద పోయాలి. గాలి చొరబడకుండా నిల్వచేస్తే ఆరు నెలలపాటు పాడవకుండా ఉంటుంది.