శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:21 IST)

కొలనులో వ్యక్తి... ఒకవైపు కొండ చిలువ.. మరోవైపు పాము..

Snake
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోను అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగానే ఉంది. ఒక్కొక్కరికీ ఒక్కో కోణంలో అర్థమవుతుంది. ఒక వ్యక్తి నల్లటి నీరు కలిగిన కొలను అంచున నిలబడి ఉన్నాడు. అతను నిలుచున్న ప్రదేశం చాలా ఇరుకుగా ఉంది. చివర నిల్చున్న అతనికి పాము నీటిలో మునిగిపోవడం కనిపించింది.
 
వెంటనే దాని దగ్గరకు వెళ్లి చేతితో పట్టుకొని గట్టున వేశాడు. పట్టుకునేటప్పుడు ధైర్యంగానే పట్టుకున్నాడు కాని గట్టున వేయగానే దాన్ని చూసి గజగజ వణికిపోయాడు. ఈ సమయంలోనే పక్కనే ఎత్తుగా ఉన్న టెంట్ నుంచి కొండచిలువ కిందకు జారి ఇతని మీద పడబోయింది. 
python
 
కొండచిలువను చూడగానే భయపడి ఆ వ్యక్తి నీటిలో పడిపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఒక పామును ఎందుకు కాపాడాడు. కొండచిలువ బారిన ఎందుకు పడ్డాడు అని అర్థంకాక జనం జుట్టు పీక్కుంటున్నారు. మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.