శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (10:05 IST)

బుధవారం ఇవి కనిపిస్తే.. అదృష్టం.. తెలుసా? (video)

బుధవారం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమని పండితులు అంటున్నారు. బుధవారం పూట అందుకే శ్రీ లక్ష్మీ నారాయణ పూజ చేయాలని వారు సూచిస్తున్నారు. అలాగే బుధవారం పూట కొన్ని వస్తువులు కనిపిస్తే అదృష్టం కలిసివస్తుందని వారు చెప్తున్నారు. అవేంటంటే..? నిద్రలేవగానే.. కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే.. ఏదో ఒకవైపు నుంచి మీకు అదృష్టం రాబోతోందని సంకేతం.
 
బుధవారం పూట నిద్రలేవగానే ఆవు గడ్డి తింటూ కనిపిస్తే అది అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతమని.. తెలుపు లేదా బంగారు వర్ణంలో పాము కలలోకనిపిస్తే.. త్వరలోనే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని సంకేతం. 
 
ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని భావిస్తున్నప్పుడు, బయలుదేరిన తర్వాత కోతి, కుక్క, పాము, పక్షి.. ఏదైనా మీ వాహనానికి కుడివైపుగా ఉంది అంటే.. మీరు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని సంకేతం. అలాగే బుధవారం పూట పచ్చని పొలాలను చూసినట్లైతే.. అలాగే కలలో పచ్చని పొలాలతో పాటు నీటిని చూశారంటే.. త్వరలోనే ఊహించని విధంగా అదృష్టవంతులు కాబోతున్నారని అర్థమని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.