సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (10:56 IST)

బుధవారం పూట విష్ణువును, వినాయక స్వామిని పూజిస్తే? (video)

బుధవారం పూట శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం పూర్తవుతాయి. బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ నివేదనల వల్ల పూజ చేసిన వారి కుటుంబానికి ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే శ్రీ నరసింహ స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలువుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.  
 
పూర్వ జన్మ పాపాలు తొలగించుకోవడం.. తెలిసీ తెలియని పాపాల నుంచి గట్టెక్కాలంటే.. మనం చేయాల్సిందల్లా శ్రీ నృసింహ స్వామిని పూజించాలి. పాపాలు తొలగిపోవాలంటే.. భక్తిని మించిన పరిహారం లేదు. పూర్తి విశ్వాసంతో.. నరసింహ స్వామిని శరణు కోరితే.. పాపాలు తొలగిపోవడం తద్వారా ఈతిబాధల నుంచి తప్పించుకోవడం వంటివి చేయొచ్చు.
 
తూర్పు దిశలో ఇంట్లోని పూజగదిలో నరసింహ స్వామి పటాన్ని వుంచి పూజించాలి. రోజూ శుచిగా స్నానమాచరించి.. నరసింహ ప్రభక్తి శ్లోకాన్ని 3, 12, 24, 48 సార్లు పారాయణం చేయడం ద్వారా ఈతిబాధలుండవు.
 
ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి పటం ముందు దీపం వెలిగించి.. మరిగించి చల్లార్చిన ఆవు పాలను లేదా పానకాన్ని నైవేద్యం చేయాలి. ఈ ప్రసాదాన్ని కుటుంబంలోని అందరూ తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు నరసింహ స్వామిని ఆరాధించినట్లైతే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
Ganesh
 
బుధవారాల్లో గణేశునిని 21 పత్రాలతో సమర్పిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. గణేశునికి బుధవారం బెల్లం, ఆవు స్వచ్ఛమైన నెయ్యిని సమర్పించాలి. గణేశుడికి బూందీ లడ్డూలు, రావి ఆకులు, సింధూరాన్ని సమర్పిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.