శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (13:21 IST)

బుధవారం ఆకుపచ్చ దుస్తులు.. పెసరట్టును మరిచిపోవద్దు... (video)

ఆదిదేవుడైన గణపతిని ఆలయాల్లో దర్శించుకోవడం మంచిది. అందుచేత బుధవారం ఉదయం, సాయంత్రం సమయాన సమీపంలోని బొజ్జగణపతి ఆలయానికి వెళ్లి.. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.  
 
బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ దుస్తులు ధరించడం ద్వారా చేపట్టిన కార్యాలు విజయవంతమవడంతో పాటు, శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా... స్త్రీలు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి వంటివి తలలో ధరించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది.
 
అలాగే బుధవారం రోజున పెసల పప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు, పెసరపప్పు పచ్చడి, పెసలతో చేసిన హల్వా, లడ్డు వంటి పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా చింత, సీమచింత పండ్లు స్వీకరించడం కూడా శ్రేయస్కరమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.