శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (11:42 IST)

భాద్రపద పూర్ణిమ.. విష్ణువుకే శాప విముక్తినిచ్చిన వ్రతాన్ని ఆచరిస్తే? (video)

భాద్రపద మాసంలో పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామికి పూజలు చేస్తారు.  అదే రోజు, ఉమా-మహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజు కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే అదే రోజు పితృపక్షం వస్తోంది. ఈ రోజున పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం.. గోమాతకు అవిసె ఆకులు ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తాయి. 
 
భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో అయితే మంచిది. సత్యనారాయణ వ్రతం ఆచరించడం.. పూజకు పువ్వులు, ప్రసాదం సమర్పించడం చేయాలి. సత్యనారాయణ కథకు విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. 
Uma-Maheshwar
 
అలాగే ఉమా మహేశ్వర వ్రతం కూడా ఈ రోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజున ఉపవాసం చేస్తారు. ఉమా-మహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. దాని ప్రభావంతో, మహిళలు దీర్ఘ సుమంగళీ ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు. వారికి తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది.
 
పూజ ఎలాచేయాలంటే?
శివపార్వతి దేవి విగ్రహాన్ని, లేదా పటాన్ని పూజగదిలో వుంది. వారికి ధూపం, దీపం, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
 
మత్స్య పురాణంలో ఉమా-మహేశ్వర్ వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి భగవంతుడు శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తుండగా,  మార్గమధ్యంలో శ్రీ మహా విష్ణువును కలిశాడు. శివుడు విష్ణువుకు ఇచ్చిన బిల్వ మాలను ఆయనకు కానుకగా ఇచ్చారు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. ఇది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి అతన్ని శపించాడు. 
 
విష్ణువును హెచ్చరించాడు. శివుడిని అగౌరవపరిచారు. కాబట్టి, శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతారని విష్ణువును శపిస్తాడు. క్షీర సాగరం నుంచి మీరు దూరమవుతారని.. శేషనాగు కూడా మీకు సహకరించదని శపిస్తాడు. ఇది విన్న విష్ణువు గౌరవంగా శాపం నుండి విముక్తి పొందటానికి పరిష్కారాన్ని అడిగాడు. 
 
అప్పుడే దుర్వాస మహర్షి ఉమా-మహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తున్నాయి.