శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (10:41 IST)

గురువారం పసుపు రంగు దుస్తులు.. పసుపు రంగు మిఠాయిని..? (video)

గురువారం పూజతో సమస్త శుభాలూ మీ సొంతం అవుతాయి. గురువారం పూజకు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. బృహస్పతికి లేదా విష్ణుమూర్తి కాకుంటే హనుమంతునికి పూజ చేసిన అనంతరం భుజించాలి. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పూజా గదిలో నేతితో దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. గురువారం ఉపవాసం వుండేవారు ఉప్పు కలిగిన భోజనం తినడం మానుకోవాలి. 
 
అరటి చెట్టును పూజించాలనుకునేవాళ్లు.. గురువారం పూట నెయ్యితో తయారు చేసిన దీపాన్ని చెట్టు ముందు ఉంచాలి. అరటి చెట్టును శుభ్రపరిచి శనగలు, పసుపు అర్పించాలి. అంతేకాకుండా గురువారం రోజు పసుపు రంగు బట్టలను దానం చేస్తే మంచిది. నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామిని సేవించడం ద్వారా ఈతిబాధలుండవు. తప్పని సరిగా పసుపు రంగులో ఉండే మిఠాయిని స్వామికి సమర్పించాలి.
 
అలాగే గురువారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అనేక శుభ ఫలితాలను పొందవచ్చు. హనుమంతుడిని గురువారం పూజించడం ద్వారా జ్ఞానం, బలం, ధైర్యం లభిస్తాయి. ''రామ'' అనే చోట రామ భక్తుడైన ఆంజనేయుడు వుంటాడని విశ్వాసం. అందుకే రామ నామ భజనతో, సింధూర పువ్వుల పూజతో, తమలపాకుల అర్చనతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదీ గురువారం హనుమంతుడిని తమలపాకులు, సింధూరంతో అర్చిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి.
 
ఇంకా తులసీ ఆకుల మాలను ఆయనకు సమర్పించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే గురువారం పూట హనుమంతునికి వడమాల, తలపాకుల మాల, వెన్నతో అర్చించిన వారికి కుటుంబంలో సంతోషాలు ప్రాప్తిస్తాయి. చేపట్టిన కార్యం విజయవంతం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
vishnu murthy
 
ఇకపోతే.. సాయిబాబాను గురువారం నిష్ఠతో పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి. పువ్వులతో పూజ చేయడంతో పాటు బాబాకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా బాబా అనుగ్రహం పొందువచ్చును. గురువారం పూట బాబా నామాన్ని స్మరించుకుంటూ చేసే పూజకు విలువ ఎక్కువ. అలాగే ఆరోజున పేద ప్రజలకు చేసే అన్నదానం పుణ్యఫలితాలను అందిస్తుంది. ఇంకా సాయిబాబాకు ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకుంటే సంకల్ప సిద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. గురువారం పూట సాయిబాబా రోజుగా కూడా పరిగణించబడుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈతిబాధలు తొలగిపోవాలన్నా, రుణబాధల నుంచి విముక్తి పొందాలన్నా.. శత్రుబాధ నుంచి తప్పించుకోవాలన్నా.. గురువారం పూట బాబాకు హల్వా, పాలకూరను సమర్పించుకోవాలి. ఇంకా సాయిబాబాకు గురువారం పూట కొబ్బరికాయ, పుష్పాలతో పాటు నైవేద్యంగా కిచిడి, పండ్లు సమర్పించవచ్చు. పుష్పాల మాలతో పాటు స్వీట్, డ్రై ఫ్రూట్స్ కూడా సమర్పించడం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు అంటున్నారు. 
Sai Baba
 
అలాగే గురువారం పూట సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే తొమ్మిది వారాలపాటు సాయిబాబా వ్రతమాచరించిన వారు లేదా బాబా స్మరణతో సంకల్ప సిద్ధి పొందినవారు భక్తులకు, పేద ప్రజలకు పండ్లు, డ్రై ఫ్రూట్లు, స్వీట్లు పంచాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.