మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (09:59 IST)

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... అన్నయ్య, తమ్ముడు కలిసి నటిస్తారా?

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబో సినిమా రెడీ అవుతోందని సమాచారం. చిరంజీవి, రామ్ చరణ్‌ తేజ్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ చిత్రంలోని చరణ్ పాత్రకోసం దర్శకధీరుడు రాజమౌళి అంగీకారంతోనే జరగాల్సింది అని అన్నారట.
 
ఆర్.ఆర్.ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్ ఓ నెల రోజులు చిరు సినిమా కోసం డేట్స్ కేటాయించడం అనేది, కష్టమనే చెప్పాలి. అందులోనూ ప్రస్తుతం ఉన్న కరోనా ప్రభావంతో అన్ని సినిమాలు చాలా ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అనేక అవాంతరాలతో నడుస్తున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ నుండి చరణ్ వేరే మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి రాజమౌళి అనుమతి ఇవ్వకపోవచ్చు.  
 
అయితే చరణ్ ఒకవేళ ఈ సినిమాలో నటించకపోతే.. ఆ స్థానంలో పవన్ నటించడం కరెక్ట్ అని చిరు, కొరటాల భావిస్తున్నారట. ఇది ఎటూ సోషల్ కాన్సెప్ట్ సినిమా కావడంతో పాటు అన్న చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో పవన్ కచ్చితంగా ఒప్పుకునే అవకాశాలు చాలానే ఉన్నాయని భావిస్తున్నారు. మరి అన్నదమ్ములిద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమాపై హైప్ అంతా ఇంతా వుండదని సినీ జనం అంటున్నారు.