సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2019 (16:24 IST)

గోపీ నువ్వు అందుకు పనికిరావు అన్నాడు: గోపీచంద్

విలన్‌తో కెరీర్‌ను ప్రారంభించి హీరోగా తెలుగు చిత్రపరిశ్రమలో నిలదొక్కుకున్నారు గోపీచంద్. జయం సినిమాలో అతి భయంకరమైన విలన్‌గా నటించిన గోపీచంద్ ఆ తరువాత హీరోగా చేయడం ప్రారంభించారు. నటించిన సినిమాలు తక్కువే అయినా గోపీచంద్‌కు తెలుగు చిత్రసీమలో మంచి పేరే ఉంది.
 
యువనటుడిగా గోపీచంద్ అందరి మన్ననలను అందుకుంటున్నాడు. చాణక్య సినిమా గత రెండురోజుల క్రితం విడుదలై సక్సెస్ టాక్‌తో ముందుకెళుతున్న సమయంలో గోపీచంద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలన్‌గా నువ్వు బాగా సెట్టయ్యావు. హీరోగా నువ్వు సెట్ కాకపోవచ్చు. నువ్వు హీరోగా పనికిరావనుకుంటాను అని దర్శకుడు తేజ నాతో అన్నారు. 
 
అయితే నేను స్లిమ్‌గా తయారై కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన తరువాత నీ యాక్షన్ బాగుంది. నేను కూడా నీతో సినిమా తీస్తానని తేజ చెప్పారు. ఆ మాట నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది అంటున్నారు గోపీచంద్. త్వరలో తేజ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తానంటున్నారు. తన కోసం ఒక కథను కూడా తేజ సిద్థం చేస్తున్నారని, తమ కాంబినేషన్లో రాబోయే సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తుందన్నారు.