సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (13:19 IST)

గోపీచంద్ చాణ‌క్య ట్రైల‌ర్ రిలీజ్. ఇంత‌కీ.. ట్రైల‌ర్ ఎలా ఉంది..?

గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం చాణక్య. ఈ చిత్రంలో గోపీచంద్ స‌ర‌స‌న‌ మెహ్రీన్ న‌టిస్తుంది. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ సినిమాని త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు తెర‌కెక్కిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. 
 
ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే...  ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో గోపీచంద్ రామ‌కృష్ణ అనే బ్యాంకు ఉద్యోగిగా, అర్జున్ అనే రా ఏజెంట్‌గా క‌నిపిస్తున్నాడు.
 
ఇది కరాచీ నేపథ్యంలో మాఫియా చుట్టూ అల్లుకున్న కథ అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న లుక్‌లో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. నాజర్, జరీన్ ఖాన్, రాజేశ్ ఖట్టర్, అరుణ్ కుమార్ ముఖ్య పాత్ర‌ల్లో కనిపిస్తున్నారు. స‌క్స‌స్ కోసం త‌పిస్తున్న గోపీచంద్ కి చాణ‌క్య ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.