ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (14:31 IST)

గోపిచంద్ మలినేనికి బంపర్ ఆఫర్.. హిట్ కొడితే..?

రవితేజ క్రాక్‌తో సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు మలినేని గోపీచంద్. దాంతో బాలకృష్ణతో సినిమా చేసే అవకాశాన్ని కల్పించింది మైత్రీ మూవీస్ సంస్థ. 'క్రాక్'లో అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు ఏకంగా బాలయ్యనే డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన గోపీచంద్ ముందు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ పెట్టారట మైత్రీ మూవీస్ వారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆరంభం కానుంది. 
 
ఆ సినిమాను జనరంజకంగా మలచగలితే గోపీచంద్‌కి మరో బంపర్ ఆఫర్ ఇవ్వటానికి సై అంటోంది మైత్రీ. అదే మహేశ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం. ఈ రెండు సినిమాలతో హిట్ కొట్టగలిగితే గోపీచంద్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరటం ఖాయం. 
 
ఇప్పటికే మైత్రీ సంస్థ మహేశ్ తో 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసింది. ఇప్పడు 'సర్కారు వారి పాట'ను రూపొందిస్తోంది. మరి మైత్రీ ఇచ్చిన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని గోపీచంద్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరతాడేమో చూద్దాం.