గోవిందా గోవిందా: తిరుమలేశునికి నటి సురేఖావాణి తలనీలాలు
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి(surekhavani) తిరుమలేశునికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం నాడు నడకదారిని వెళ్లి తిరుమలకు చేరుకున్న సురేఖావాణి తొలుత తలనీలాలు అర్పించి అనంతరం తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకి వచ్చాక ఆమెను గుర్తుపట్టిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అడిగినవారికి కాదనకుండా ఫోటోలకి ఫోజులిచ్చారు సురేఖావాణి.
సురేఖవాణి అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులను పలుకరిస్తుంటారు. ఏమైనా విషయాలు వుంటే పంచుకుంటూ వుంటారు. అప్పుడప్పుడు రీల్స్, డ్యాన్సులు చేస్తూ తన ఫ్యాన్సుకి హుషారెక్కిస్తుంటారు.