సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 13 ఆగస్టు 2020 (15:50 IST)

మహేష్ బాబు ఛాలెంజ్ స్వీకరించిన శృతి హాసన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్‌ని స్వీకరించి హైదరాబాద్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు ప్రముఖ సినీనటి శృతి హాసన్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
 
ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా అలాగే రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన లేడి సూపర్ స్టార్ కమలహాసన్ తనయ శృతి హాసన్ తన నివాసంలో మొక్కలు నాటారు. 
 
ఈ సందర్భంగా తననీ నామినేట్ చేసిన మహేష్ బాబుకి అలాగే దేవిశ్రీప్రసాద్‌కి ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటిన శృతి హాసన్ మరో ముగ్గురిని నామినెట్ చేశారు. వారిలోబాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హీరోయిన్ తమన్నా, రానా దగ్గుబాటి ఉన్నారు.