బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (20:34 IST)

అయ్యో.. శృతికి అక్కడ అంత అవమానమా? అందుకే వదిలేసిందా..?

సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకే కాదు ఉన్నవాళ్ళకి బాలీవుడ్లో అవమానం తప్పడం లేదు. సౌత్ నుంచి వెళ్ళిన కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్‌కు పరాభవం ఎదురైంది. బాలీవుడ్‌లో నెపోటిజంపై తీవ్ర చర్చ నడుస్తున్న టైంలో శృతి చేసిన కామెంట్స్ ఆశక్తికరంగా మారాయి.
 
బాలీవుడ్లో కొందరి చేతుల్లోనే ఉందన్న ప్రచారం ఇప్పటిది కాదు. సుశాంత్ ఆత్మహత్య తరువాత నెపోటిజం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారిని బాలీవుడ్ చిన్నచూపు చూస్తోంది.
 
దీనికి కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ ఉదాహరణ. బాలీవుడ్ పైన ఆశక్తికర విమర్సలు చేసిందామె. బాలీవుడ్లో అవమానాలు ఎదుర్కొన్న హీరోయిన్స్‌లో శృతి కూడా ఉంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. దక్షిణాది స్టార్స్‌ను బిటౌన్‌లో చిన్నచూపు చూస్తారని వారి దృష్టిలో ఔట్ సైడర్ భావన ఉందని చెప్పుకొచ్చింది శృతి.
 
విచిత్రమేమింటే శృతి లక్ అనే హిందీ సినిమాతో పరిచయమైంది. అప్పుడప్పుడు హిందీ సినిమాలు చేసినా శృతి హాసన్‌కు మాత్రం సక్సెస్ దక్కలేదు. గబ్బర్ సింగ్‌లో అక్షయ్ కుమార్‌తో జతకట్టింది. రామయ్యా వస్తావయ్యా, బెహన్ బోగీ తేరిలో యంగ్ హీరోలతో నటించినా గుర్తింపు దక్కలేదు. పట్టించుకోకపోగా చిన్నచూపు చూస్తున్నారని బాలీవుడ్‌కు దూరమైంది ఈ అమ్మడు.