సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (12:01 IST)

రొమ్ము కేన్సర్ బారినపడిన తెలుగు హీరోయిన్!

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ (రొమ్ము)బారినపడ్డారు. ఇది గ్రేడ్ 3 రకం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈమె పూణెలో నివాసం ఉంటున్నారు. 
 
గత కొంతకాలంగా 37 యేళ్ల ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం బ్రెస్ట్ కేన్సర్ బారినపడినట్టు ఆమె తెలిపారు. ఇది మూడో దశలో ఉందన్న విషయం తాజాగా బయటపడిందని తెలిపారు. కాగా, హంసా నందిని తల్లి కూడా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 
 
అలాగే, ఆమె తాజాగా ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో ఆమె గుండు చేయించుకునివున్నారు. అయితే, తనకు బ్రెస్ట్ కేన్సర్ అని తెలిసినప్పటికీ ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని వెల్లడించడమే కాకుండా, మరింత యాక్టివ్‌గా ఉంటటం గమనార్హం. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఒకింత షాక్‌కు గురయ్యారు.