బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (08:41 IST)

భవదీయుడు భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ బద్దల్ అవ్వాల్సిందే అంటున్న హ‌రీశ్ శంక‌ర్‌

Harish Shankar, Ravi, naveen,  Pawan Kalyan
Harish Shankar, Ravi, naveen, Pawan Kalyan
ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా న‌టిస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రం షూటింగ్ ఈరోజు నుంచి హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. గ‌త కొద్దిరోజులుగా యాక్ష‌న్ సీన్ కోసం ఆయ‌న శిక్ష‌ణ తీసుకున్నాడు. ప్రాక్టీస్ కూడా చేశాడు. ఎ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌కుడు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్రాక్టీస్ చేస్తున్న యాక్ష‌న్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి. 
 
Harish Shankar, Pawan Kalyan
Harish Shankar, Pawan Kalyan
కాగా, తాజాగా ప‌వ‌న్‌తో ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ఓ సినిమా చేస్తున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే పేరు పెట్టారు. ఈ చిత్రం ఎప్ప‌టినుంచో కార్య‌రూపం దాల్చాల్సివుంది. కొన్ని అనివార్య కార్య‌కారణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. కొద్ది షూట్ చేశార‌నే టాక్ కూడా వుంది. అయితే గురువారంనాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌, నిర్మాత‌లు యెర్నేని ర‌వి త‌దిత‌రులు క‌లిశారు. మైత్రీమూవీస్ సంస్థ అధినేత‌లు అయిన వారు ప‌వ‌న్ క‌లిసి త‌దుప‌రి చిత్రం గురించి చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. ఈ సంద‌ర్భంగా ఆ సంస్థ ఫొటోల‌ను విడుద‌ల‌చేసింది. దానితోపాటు ఉత్తేజకరమైన వార్తలు & అప్‌డేట్‌లు రాబోతున్నాయి. అతి త్వరలో భారీ షూట్‌ను ప్రారంభించబోతున్నాం. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దల్ అవ్వాల్సిందేఅంటూ.. ట్వీట్ చేసింది.