ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (16:01 IST)

హార‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ నేపథ్యంతో హ‌లో ఎవ‌రు? చిత్రం

Hello Evaru?
Hello Evaru?
తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం ‘హ‌లో ఎవ‌రు?.  ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం, హీరోయిన్ గా సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ ,విలన్ గా వినాయక్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.
 
ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తర్వలో సెన్సార్ కి వెళ్లనుంది . ఈ క్రైం అండ్ హ‌ర‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కనిర్మాత‌ వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని, ఇండ‌స్ట్రీలో ఈ చిత్రానికి స్పెష‌ల్ క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. దసరా పండుగ కు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్శక నిర్మాత వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తుందని, వచ్చే నెలలో ట్రైలర్ ను లాంచ్ చేస్తామని వెంక‌ట్‌రెడ్డి నంది పేర్కొన్నారు.  
 
న‌టీన‌టులు:
 విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం(హీరో), సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ (హీరోయిన్), వినాయ‌క్ (విలన్ ), గాదె స‌తీష్, యుగ దుర్గ‌ న‌రేష్ , వేద‌శ్రీ మ‌ల్ల‌, చిత్రం శ్రీ‌ను, ఘ‌ర్ష‌ణ శ్రీ‌నివాస్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, జ‌బ‌ర్‌ద‌స్త్ రాజ‌మౌళి, గ‌బ్బ‌ర్ సింగ్ సాయి, గ‌బ్బ‌ర్ సింగ్ డూప్ రాజ‌శేఖ‌ర్ త‌దిరులు న‌టించారు.