ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (15:50 IST)

తమిళ హీరో కార్తీ ఫేస‌బుక్ ఖాతా హ్యాక్

karthi
తమిళ చిత్రపరిశ్రమలో ప్రముఖ హీరోగా ఉన్న కార్తీ ఫేస్‌బుక్ ఖాతాను సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
"హాల్లో ఫ్రెండ్స్... నా ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేశారు. దాన్ని తిరిగి పొందేందుకు ఫేస్‌బుక్ బృందాన్ని సంప్రదిస్తున్నాం" అంటూ ట్వీట్ చేశారు. కాగా, కార్తీ తన ఫేస్‌బుక్ ఖాతాలో3.9 మిలియన్ ఫాలోయర్లను కలిగివున్నాడు. 
 
ఇదిలావుంటే, హీరో కార్తీ నటించిన చిత్రాలన్నీ ఘన విజయం సాధిస్తున్నాయి. వీటిలో 'సుల్తాన్', 'విరుమన్', 'పొన్నియిన్ సెల్వన్', 'సర్దార్' వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఇపుడు జపాన్ చిత్రంలో నటిస్తున్నారు.