శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (10:46 IST)

శృంగారం ఎలా చేయాలో నాగశౌర్య నేర్పించాడు : కశ్మీరా

సినిమా అడిషన్స్‌లో పాల్గొన్నపుడు నవరసాలను చేసి చూపింసమన్నారు. అపుడు శృంగారం విషయంలో నాగశౌర్య ఎంతగానే సహకరిస్తూ చేసి ఎలా చేయాలో నేర్పించాడని "నర్తనశాల" హీరోయిన్ కశ్మీరా పరదేశి చెప్పుకొచ్చింది.

సినిమా అడిషన్స్‌లో పాల్గొన్నపుడు నవరసాలను చేసి చూపింసమన్నారు. అపుడు శృంగారం విషయంలో నాగశౌర్య ఎంతగానే సహకరిస్తూ చేసి ఎలా చేయాలో నేర్పించాడని "నర్తనశాల" హీరోయిన్ కశ్మీరా పరదేశి చెప్పుకొచ్చింది. 
 
నర్తనశాల చిత్రం శంకర ప్రసాద్‌ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస చక్రవర్తి దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ కశ్మీరా పాల్గొని మాట్లాడుతూ, 'నా మాతృభాష మరాఠీ. ఇంతకుముందు మోడలింగ్‌ చేశాను. ఆ తర్వాత థియేటర్స్‌ చేశాను. వెండితెరమీద కనిపించడం ఇదే తొలిసారని తెలిపింది.
 
ఈ సినిమా ఆడిషన్స్‌లో పాల్గొన్నప్పుడు నవరసాలను చేసి చూపించమన్నారు. శృంగారం నా బలం అని అప్పుడే నాకు అర్థమైంది. కెమెరాకు ఫోజులివ్వడం నుంచి, తెలుగు మాట్లాడటం వరకు అన్నిటిలోనూ నాకు హీరో నాగశౌర్య సాయం చేశారు అని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, ముంబై ప్రజలు తెలుగు, తమిళ సినిమాలను బాగా చూస్తారు. ఎక్కువగా అల్లు అర్జున్‌, మహేశ్‌, చిరంజీవి నటించిన చిత్రాలను చూస్తారు. అలా నాకు సౌత్‌ సినిమాలతో పరిచయం ఉందని తెలిపింది.