ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (17:30 IST)

జూబ్లీహిల్స్‌లో నందమూరి రామకృష్ణ కారు ప్రమాదం ఎలా జరిగింది!

Ramakrishna car
Ramakrishna car
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.10లో బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ కారు ప్రమాదానికి గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసు వర్గాలు తెలియజేశాయి. నిన్న పగలు ఆయన కారులో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ డౌన్‌కు దిగుతూ రోడ్‌నెం.10కు వెళుతూ టర్న్‌ తిరిగే క్రమంలో అక్కడ ఓ భవన నిర్మాణ పనులు జరగడం ఆ పక్కనే రోడ్డుపై రాళ్ళు, మట్టి వుండడంతో స్పీడ్‌కు ఎదురుగా వున్న డివైడర్‌కు గుద్దినట్లు తెలిసింది. శుక్రవారం 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన మొదట ఎవరో అనుకున్న అక్కడి ప్రయాణీకులు కారులోంచి ఆయన్ను బయటకు రప్పించారు.  ఆ తర్వాత వెంటనే ఆయన మరో కారులో వెళ్ళిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.
 
ఇది తెలిసిన వెంటనే నందమూరి అభిమానులు కాస్త కంగారు పడ్డా ఇప్పుడు అంతా క్షేమం అని తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు మోహనకృష్ణ కుమారుడు తారకరత్న ప్రచారయాత్ర సందర్భంగా గుండెనొప్పితో బాధపడుతు బెంగుళూరులో చికిత్స తీసుకుంటున్నారు. గతంలో ఎన్‌.టి.ఆర్‌. బతికున్నప్పుడే ఓసారి నందమూరి రామకృష్ణకు భారీ రోడ్డు ప్రమాదం జరిగింది చావునుంచి బయటపడ్డారు. ఇది అప్పట్లో సంచనలం అయింది. అప్పటినుంచి ఆయన మోచేయి, కాలు దెబ్బతిన్నాయి.