సీరియల్ నటి ప్రేమలో హైపర్ ఆది?
జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చినా అందులో హైపర్ ఆది ట్రాక్ చాలా డిఫరెంట్. మాట మాటకు పంచ్ విసురుతూ రచ్చ చేయడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య. ఇక అమ్మాయి కనిపిస్తే చాలు రొమాంటిక్ బాణాలతో కుడి పంచులు విసరడం ఆది స్టైల్.
ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన 'భలే మంచి రోజు' షో ప్రోమోలో ఆది తన ప్రేమ విషయమై ఓపెన్ అయ్యారు. వేదికపై ఓ సీరియల్ నటిని చూసి ఆమే నా లవర్ అంటూ రెచ్చిపోయాడు. ఆదిలో ఈ కోణం మరోసారి ఆయన్ను వార్తల్లో నిలబెట్టింది. రెండో చాప్టర్ సెప్టెంబర్ 4వ తేదీన ప్రసారం కాబోతుంది. తాజాగా ఈ షో ప్రోమో వదిలారు.
ఈ ప్రోమో వేడిలో హైపర్ ఆది హైలైట్ అయ్యాడు. తాను 'శతమానం భవతి' సీరియల్ నటితో ప్రేమలో పడినట్లు చెప్పడం, దానికి ఆమె కూడా సహకరిస్తూ ఆదితో డ్యాన్స్ చేయడం, ఆయన కాలుమీద కూర్చోవడం లాంటి సీన్స్ చూపించారు. అంతేకాదు ఈ ఇద్దరిపై లవ్ సింబల్స్ కూడా వేసేశారు. దీంతో ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారింది.