శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 మార్చి 2021 (15:50 IST)

ఆఫర్ల కోసం మెగాస్టార్, పవర్ స్టార్‌లకు ఫోన్ చేశాను: కోట

కోట శ్రీనివాసరావు. హాస్యం, విలనిజం.. ఏ పాత్రనైనా అవలలీలగా పోషించగలరు కోట శ్రీనివాస రావు. 70 ఏళ్ల వయసులోనూ కోట శ్రీనివాసరావుకి నటించడమే ప్యాషన్. లాక్ డౌన్ సమయంలో షూటింగులు లేకపోవడంతో ఇంటికే పరిమితమైపోయారాయన. 
 
ఈమధ్య మళ్లీ షూటింగులు ప్రారంభం కావడంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లకు ఫోన్ చేసి ఆఫర్ అడిగినట్లు ఆయనే చెప్పారు. పవన్-క్రిష్ చేస్తున్న చిత్రంలో తనకు పాత్ర ఇచ్చారని సంతోషంగా చెప్పారు. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించడంతో ఆనందంగా వుందన్నారు.