సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (19:23 IST)

విరాట‌ప‌ర్వంలో ఎమోష‌న‌ల్ సాంగ్ పాడా - ప‌దేళ్ళ‌నాడే పాన్ ఇండియా స్టార్‌న‌య్యా - రానా దగ్గుబాటి ఇంట‌ర్వ్యూ

Rana Daggubati
Rana Daggubati
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో రానా ఓ పాట‌నుకూడా పాడారు. న‌గ్జ‌ల్ నాయ‌కుడిగా చైత‌న్య‌వంతం చేసే ఆ పాట పాడేట‌ప్పుడు ఎమోష‌న్‌ను త‌ట్టుకోలేక‌పోయాను. గొంతుకూడా జీర‌పోయిందంటూ హీరో రానా  మీడియాతో ప‌లు విష‌యాలు పంచుకున్నారు.
 
 ఒక ఉద్యమ నేపధ్యమున్న రవన్న జీవితంలోకి ప్రేమ ఎలా ప్రవేశిస్తుంది ?
ఇప్పుడే కథ మొత్తం చెప్పెలేం కదా (నవ్వుతూ) రవన్న కానీ దళం సభ్యులు కానీ మరో ఉద్యమ నాయకులు కానీ ఖచ్చితమైన లక్ష్యంతో వుంటారు. కుటుంబ, స్నేహ సంబంధాలు కన్నా సమాజమే ముఖ్యమని జీవిస్తారు. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా వెళ్తున్న రవన్న జీవితంలోకి వెన్నెల ప్రవేశిస్తుంది. ఇక్కడే ఒక మోరల్ డైలమా వుంటుంది. ఒక లక్ష్యం కోసం పని చేయాలా ? ఫ్యామిలీతో కలసి రిలాక్స్ అవ్వాలా? అనేది ఒక మోరల్ డైలమా.ఈ సినిమా మోరల్ డైలమా గురించి వుంటుంది.
 
 ఈ సినిమా చేసిన తర్వాత నక్సల్స్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది ?
టైం ని రీక్రియేట్ చేయడం సినిమా వలనే సాధ్యం. నక్సల్ మూమెంట్ గురించి టీవీల్లో, న్యూస్ పేపర్స్ లోవచ్చిన  కొన్ని హైలెట్స్ మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు రియల్ గా ఎలా వుంటారు ? యూనివర్షిటీలో చదువుకున్న విద్యార్ధులు కూడా నక్సల్స్ గా ఎందుకు మారారు ? ఇలాంటి వివరాల్లోకి వెళ్ళలేదు. రవన్న కథలో మాటల రూపంలో ఇలాంటి వివరాలు కొన్ని తెలుస్తాయి. కొన్ని సంఘటనలు, పొలిటికల్ డ్రామా నడుస్తుంటుంది. కానీ ఈ కథలో ప్రధాన సారాంశం మాత్రం ప్రేమ.
 
మీకు పాన్ ఇండియా రీచ్ వుంది కదా విరాటపర్వం పాన్ ఇండియా ప్లాన్ చేయకపోవడానికి కారణం?
ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు కానీ నేను పదేళ్ళుగా ఆ పాన్ లోనే ఆమ్లెట్లు వేసుకుంటున్నాను(నవ్వుతూ). కొన్ని కథలు తెలుగులోనే చేయాలి. విరాట పర్వం మొదలు పెట్టినప్పుడే మాకు పాన్ ఇండియా ఆలోచన లేదు. ఇది ఒక ప్రాంతానికి సంబధించిన కథ. ఆ ప్రాంతం తాలూకు సాహిత్యం ఎక్కువగా వుంది. దర్శకుడు వేణు ఉడుగుల స్వతహాగా సాహిత్యకారుడు. ఈ సాహిత్యం మరో భాషలో కుదరక పోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆలోచన పెట్టుకోలేదు. ఐతే  మలయాళం, బెంగాళీ, హిందీలో డబ్ చేస్తున్నాం.
 
హిరణ్య‌క‌శ్య‌ప ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది?
ఇప్పుడు నా నుండి రాబోతున్న సినిమాలు హీరోయిజం ఉండేవే. చాలా కొత్తగా వుంటాయి .హిరణ్యకశ్యప చేస్తున్నా. దాని కంటే పెద్ద కమర్షియల్ సినిమా వుండదు. నా వరకూ అది కమర్షియల్.  కథ సీరియస్ గా జరుగుతున్నపుడు సడన్ గా డ్యాన్స్ వేస్తె నేను బయటికి వెళ్ళిపోతా. ఇవి నాకు ఎక్కవు. అలాగే హీరోయిన్ ని టీజింగ్ చేసిన ఇబ్బందిగా వుంటుంది. ఇలాంటివి నచ్చవు. మనం టెంపరరీ. సినిమాలు శాశ్వతం. చాలా మంది గొప్ప నటులు వదిలేసిన గొప్ప విషయాలనే గుర్తుపెట్టుకుంటాం. అలా గొప్ప గుర్తుపెట్టుకునే వర్క్ చేయాలని వుంది.
 
సాయి పల్లవితో పాటు జరీనా వాహెబ్, ప్రియమణి, ఈశ్వరి రావు, నందిత దాస్,  పాత్రలు కూడా వున్నాయి కదా ..వాళ్ళ ప్రాధన్యత ఎలా వుంటుంది ?
రవన్న, వెన్నెల కాకుండా ఈ సినిమా లో కనిపించే దాదాపు అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంది. ప్రధాన పాత్రలే కాకుండా మిగతా పాత్రలు చెప్పిన డైలాగ్స్, ఆలోచనలతో కూడా కథ వేగంగా ముందుకు వెళుతుంది. ''జరీనా వాహెబ్, ప్రియమణి, ఈశ్వరి రావు, నందిత దాస్.. ఈ పాత్రలన్నీ బలంగా వుంటాయి. ఇది మహిళా చిత్రం. స్క్రీనింగ్ చూసి అబ్బాయిలంతా వావ్ అంటే.. మహిళా ప్రేక్షకులు కంటతడి పెట్టుకొని అద్భుతమని చెబుతున్నారు.
 
మీ సినిమాలకి చాలా గ్యాప్ వస్తుంది కదా ?
చాలా త్వరగా సినిమాలు చేసేవాడిని. మధ్యలో చిన్న  హెల్త్ ఇష్యూ వచ్చింది. ఐతే నేను వచ్చి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వచ్చింది. ఇది సెట్ లో తీసే సినిమా కాదు. పరిస్థితులు సర్దుకున్నాక మళ్ళీ అడవిలోనే షూట్ ఫినిష్ చేశాం. విడుదల తేది విషయానికి వస్తే.. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. రెండు మూడు వారాలు మనకే వున్నపుడు వస్తే బావుంటుందని అనుకున్నాం. జూన్ 17న వస్తున్నాం. దిని తర్వాత రెండు వారాల వరకూ ఎలాంటి సినిమా లేదు. ప్రేక్షకులంతాహాయిగా విరాటపర్వం ఎంజాయ్ చేయొచ్చు. 
 
సాయి పల్లవి గారి గురించి ?
సాయి పల్లవి గొప్ప నటి. విరాట పర్వంలో వెన్నెల పాత్రలో మరో స్థాయిలో వుంటుంది. ఇది వెన్నెల కథని ట్రైలర్ లో చెప్పాం. రవన్న పాత్రని మరొకరు చేస్తారో లేదో తెలీదు కానీ వెన్నెల పాత్రని సాయి పల్లవి తప్పితే మరొకరు చేయలేరు. సాయి పల్లవి చాలా సింపుల్ పర్శన్. ఆ సింప్లీసిటీ వల్లే ఇంత అద్భుతమైన నటన కనుబరుస్తుందని భావిస్తున్నా.
 
విరాట పర్వం లాంటి కథ ఇప్పుడు రావడం ప్రజంట్ ట్రెండ్ కి సరైనదేనా ?
విరాట పర్వంకి ఇదే సరైన సమయం. మన ప్రపంచాన్ని వదిలేసి వేరే ప్రపంచంలో నాన్ స్టాప్ గా ఉండగలిగితే అదే సినిమా ఎక్స్ పిరియన్స్. విరాట పర్వం అలాంటి ఎక్స్ పిరియన్స్ వున్న సినిమా. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఒక ప్రేమ కథ రిలాక్స్ గా హ్యాపీ గా వెళ్తుంటుంది. కానీ ఇది భయం భయంగా వెళ్తుంది. ఈ వైవిధ్యం చాలా కొత్తగా వుంటుంది.
 
విరాట పర్వం ప్రివ్యూలు వేశారు కదా.. ఎలాంటి స్పందన వచ్చింది ?
చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అందరూ వండర్ ఫుల్ అంటున్నారు. విరాటపర్వంలో మొదటిసారి ఓ పాట పాడాను.