శుక్రవారం, 4 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 3 జులై 2025 (17:55 IST)

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

Seven Hills Satish
Seven Hills Satish
మన సినిమాలో విషయం ఉంటే జనాల్లోకి వెళుతుంది. రివ్యూస్ ఎలా ఉన్నా కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే సినిమా విడుదలైన మూడు రోజులపాటు అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని సోలో బాయ్ నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ అన్నారు. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నవీన్ కుమార్ దర్శకత్వంలో  సోలో బాయ్ చిత్రం జూలై 4వ విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా సతీష్ విలేకరులతో పలు విషయాలు తెలియజేశారు.
 
-  సోలో బాయ్ చిత్ర హీరో గౌతమ్ కృష్ణ నాకు చాలా మంచి స్నేహితుడు. అతను ఈ సినిమా లైన్ చెప్పినప్పుడు మధ్యతరగతి కుటుంబంలోని 17 సంవత్సరాల నుండి సెటిల్ అవ్వడానికి పడే కష్టం తాలూకా పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది.
 
- ప్రొడక్షన్ విషయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కడ పెట్టకుండా ప్రతి విషయంలో జాగ్రత్తపడి ఖర్చు పెట్టాము. చిత్రానికి పనిచేసిన యంగ్ టీం అంతా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా విడుదల తర్వాత వారికి లాభాల నుండి తగ్గ డబ్బును ఇస్తాను.
 
- ప్రస్తుత సినిమా మార్కెట్ గురించి చెప్పాలంటే.. గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాము. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.
 
- గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ కు వెళ్లే ముందు సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కొన్ని సీన్లు మాత్రం చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుని ఇంకా బాగా వచ్చేలా జాగ్రత్త పడ్డాం.
 
-  సాధారణంగా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని తెలిసు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఆశయంతో నిర్మాతగా వచ్చాను.
 
- నేను ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని చిత్రాలకు పని చేశాను. ఆ తర్వాత డబ్బు సంపాదించుకున్న వద్దామని రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొంత డబ్బులు సంపాదించి ఆ తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను.
 
- చిత్ర పరిశ్రమలో ఉన్న కొంతమంది టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపత్ నంది, బలగం వేణు నాకు మంచి స్నేహితులు. అలాగే నేను సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా వేరే ప్రొడక్షన్స్ లో పనిచేశాను. ఆ సమయంలో నందినీ రెడ్డి, మచ్చ రవి నాచురల్ స్టార్ నానితో కూడా కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఆ అనుభవంతోనే అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాము.
 
- చిత్ర పరిశ్రమలో ఎంతోమంది తెలిసినప్పటికీ దేశం కోసం ప్రాణాలు నడిపించిన మురళి నాయక్ వంటి వీరులని గుర్తించి వారి కుటుంబ సభ్యుల చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ చేపిద్దామని గౌతమ్ నాతో అన్నారు. వెంటనే మేము అంతా సరే అని వారి చేతుల మీదగా ట్రైలర్ నుంచి చూపించి వారి కుటుంబానికి మా వంతుగా లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి సపోర్టుగా నిలవడం జరిగింది. మురళి నాయక్ రియల్ హీరో.
 
- ఎన్నో వేలమంది, లక్షలమంది చూసి ఆదరించే సినిమా వారిని సంతృప్తి పరిచే విధంగా ఉండాలంటే కథ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. నేను అటువంటి జాగ్రత్తలే తీసుకుని సినిమాలు తీస్తున్నాను. అలాగే సినిమాలు చేయాలంటే ఇష్టం కాదు, పిచ్చి ఉండాలి. నాకు సినిమాలు అంటే అటువంటి పిచ్చి ఉంది.
 
- త్వరలో  నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది.