ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (15:03 IST)

కంటెంట్ ని అమ్మలానే చూస్తాను : రైటర్ పద్మభూషణ్‌ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్

Director Shanmukha Prashanth,
Director Shanmukha Prashanth,
సుహాస్ తో ఏర్పడిన పరిచయం ఇప్పడు సినిమా చేస్తే దాగా వెళ్ళింది. మాది విజయవాడ కావడంతో ఐడియాస్ సింక్ అయ్యాయి.. అని  రైటర్ పద్మభూషణ్‌ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ అన్నారు.  సుహాస్ హీరోగా ‘రైటర్ పద్మభూషణ్‌ చిత్రానికి  నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు.  టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రైటర్ పద్మభూషణ్‌ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్  చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
ఈ సినిమాలో మీ సొంత అనుభవాలు ఉంటాయా ?
మాది మధ్య తరగతి కుటుంబం కావడం వలన సహజంగానే ఆ టచ్ వుంటుంది. ఇది ఫ్యామిలీ మూవీ అని మొదటి నుండి చెబుతున్నాం. అలా అని వేడుకలు, చుట్టాలు, బంధువులు ,మెలో డ్రామాలా వుండదు. ఇది మన ఇంట్లో జరిగే కథ. ప్రతి పాత్రలో అల్లరి వుంటుంది. రైటర్ పద్మభూషణ్‌ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలిపారు. 
 
మీ నేపధ్యం గురించి చెప్పండి ?
 మాది విజయవాడ. అక్కడే బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాను. బిటెక్ లో ఉన్నప్పుడే సినిమాలపై ఆసక్తి వుండేది. హైదరాబాద్ వచ్చాక ప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే సినిమాల్లో ప్రయత్నిస్తున్నాననే సంగతి ఇంట్లో చెప్పలేదు. ఇక్కడ కొందరి దగ్గర రాశాను. బాగా రాస్తున్నానని మెచ్చుకునే వారు కానీ ఏం ఇచ్చేవారు కాదు. అయితే బాగా రాస్తున్నానని వారు చెప్పే మాట నాకు ధైర్యాన్ని స్ఫూర్తిని ఇచ్చేది. నేనూ ఇక్కడ పనికి వస్తాననే నమ్మకాన్ని ఇచ్చేది. సుహాస్ గారితో షార్ట్ ఫిల్మ్ నుండి పరిచయం. కలర్ ఫోటో సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశాను. అదిసెట్ పై ఉండగానే ఫ్యామిలీ డ్రామాకి రచయితగా అవకాశం వచ్చింది. రచయిత కావడం వలన అక్కడ నా ప్రజన్స్ ఎక్కువ కావాలి. అందుకే ఇక్కడ దర్శకుడికి చెప్పి అటు వెళ్లాను. అది పూర్తి అయిన వెంటనే దర్శకుడిగా నా మొదటి సినిమా సుహాస్ గారితో రావడం నా అదృష్టం. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది.
 
ఈ కథకు స్ఫూర్తి ?
మనకు తెలిసిందే..ఒక కొత్త కథని చెప్పాలనే ప్రాసస్ నుంచి పుట్టిన కథ ఇది. ఇందులో హీరో లైబ్రేరియన్. ఆ వాతావరణం వుంటుంది. మొన్న హరీష్ శంకర్ గారు చాలా రోజుల తర్వాత సినిమాలో ఒక పుస్తకాన్ని చూశాను అని అన్నారు. ఈ సినిమా కూడా అంతే రిఫ్రషింగ్ గా వుంటుంది. చాలా మంచి కథ ఇది.  
 
సాదారణంగా సినిమాల్లో రైటర్ ని హీరోగా చూపించడం అరుదు కదా ?
నా పర్శనల్ ఫీలింగ్ లో రచయితే అన్నిటికి మూలం. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కంటెంట్ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత జర్నీ ఇందులో వుంటుంది. ఇందులో హీరో పాత్ర పేరు పద్మభూషణ్‌. తను ఒక రైటర్ కావాలని అనుకుంటాడు. మరి రచయిత అయ్యాడా లేదా  తన ప్రయాణం ఎలా సాగింది .. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
 
సుహాస్ అంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలి ? మరి ఇది కంటెంట్ పరంగా ఎలా వుంటుంది?
సుహాస్ తో సినిమా అనగానే కంటెంట్ వుండాలి. దానిని ద్రుష్టిలో పెట్టుకునే వర్క్ చేశాను. నా ద్రుష్టిలో కంటెంట్ ని ఒక అమ్మలానే చూస్తాను. సుహాస్ కి కంటెంట్ ఇమేజ్ వుండటం ఎంతో హెల్ప్ అయ్యింది. విజయవాడలో ఓ కుర్రాడి జర్నీ ఇది. తనకో కుటుంబం వుంటుంది. తనని ప్రేమించే అమ్మాయి వుంటుంది. తను ఏం కావాలని అనుకున్నాడో ఏం అయ్యాడు అనే జర్నీ చాలా బ్యూటీఫుల్ గా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో తెలియకుండా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రన్ అవుతుంటుంది. ఈ రెండు కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా వుంటాయి.
 
ఇది మీ తొలి సినిమా కదా.. నిర్మాతల సహకారం గురించి ?
నిర్మాతల అద్భుతంగా సహకరించారు. ఎలాంటి పరిమితులు పెట్టలేదు. అయితే చెప్పిన సమయానికి అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేస్తానని నిర్మాతలకు చెప్పాను. ముందే చెప్పినట్లే పూర్తి చేశాను.
 
కొత్త సినిమాల గురించి ?
కొన్ని కథలు వున్నాయి. ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో వుంది