శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 20 మే 2021 (20:31 IST)

ఆడ‌పిల్ల‌ను క‌నాల‌నుందిః అన‌సూయ‌

Anasuya-1
ఏ విష‌యాన్నైనా నిర్భ‌యంగా వెల్ల‌డించే యాంక‌ర్, న‌టి అన‌సూయ‌. ఆమెకు ఓ బాబు. అత‌ని పుట్టిన‌రోజు ఈరోజే. వాడితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే మాతృత్వంలో వున్న సూప‌ర్ ప‌వ‌ర్ అంటే నాకు ఇష్టం. ఒక‌రికి జ‌న్మ ఇవ్వ‌డం అదృష్టం అంటూ చెబుతోంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, టైం కుదిరితే ఆడ‌పిల్ల‌ను క‌నాల‌నుంద‌ని పేర్కొంది. అంతేకాకుండా మాతృత్వం అనుభూతిలో థ్రిల్ వుంది. అది వ‌ర్ణించ‌లేనిది. నాకు పాప పుడితే ఎక్క‌వ స‌మ‌యం త‌న‌తోనే వుంటాను. బాధ్య‌త‌గా తీసుకుంటాను అని మ‌న‌సులోని మాట‌ను ఆవిష్క‌రించింది.
 
అంతేకాదండోయ్‌..అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. అందుకే త‌న ప్రేమ‌క‌థ‌లో చాలా మ‌సాలా వుంది. త‌న క‌థ‌ను అవ‌స‌ర‌మైతే సినిమాగా చేయాల‌నుంద‌ని చెబుతోంది. అదెలా వున్నా, ఇటీవ‌లే ఆమె న‌టించిన `థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌` సినిమా ఓటీటీలో విడుద‌లైంది. ఆ సినిమాలో గ‌ర్భిణీగా న‌టించింది. అప్పుడు త‌న మాతృత్వం మ‌రోసారి గుర్తుకు వ‌చ్చింది. అందుకే చాలా సులువుగా పాత్ర చేయ‌గ‌లిగాన‌ని తెలిపింది. ప్ర‌స్తుత‌తం ఆమె పుష్ప సినిమాలో న‌టించింది. ఇది కాకుండా ఖిలాడి, రంగ‌మార్తాండ‌, ధి చేజ్ సినిమాలు విడుద‌ల కావాల్సివున్నాయి.