1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (15:42 IST)

ఇండియా సినిమాటిక్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది : నాగార్జున అక్కినేని

India joy joti prajyala nag
India joy joti prajyala nag
ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు.

Nagarjuna Akkineni, Nag Ashwin, KK Senthil and others
Nagarjuna Akkineni, Nag Ashwin, KK Senthil and others
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయగా..ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథిగా విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినిమాటికా ఎక్స్ పో ఫౌండర్, తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.జి.విందా, రోటో మేకర్ ఫౌండర్ మైక్, గ్రీన్ గోల్డ్ ఛీప్ మార్కెటింగ్ హెడ్ భరత్, కంట్రీ హెడ్ ఫర్ టెక్నికల్ బిరేన్ గోస్, జయేష్ రంజన్ ఐఏఎస్, సినిమాటోగ్రఫర్ పీజీ విందా, నాగ్ అశ్విన్, నిర్మాత సుప్రియ, డ్యాన్సింగ్ ఆటం క్రియేటివ్ హెడ్, ఫౌండర్ సరస్వతి వాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
 
కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘ఇప్పుడు రోజురోజుకూ టెక్నికల్‌గా ఎన్నో మార్పులు వస్తోంది. నన్ను ఈ కార్యక్రమానికి పిలవడం ఆనందంగా ఉంది. 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించాం. నెలకు ఒక షూటింగ్ జరిగితే చాలనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పరిణామాలు వచ్చాయి. ఎంతో మారింది. హైద్రాబాద్ అనేది సినిమాకు పరిశ్రమకు రాజధానిలా మారనుంది. సౌత్ ఫిల్మ్స్‌ని ఇండియా అంతా ఫాలో అవుతోంది. నాగ్ అశ్విన్ వంటి అద్భుతమైన దర్శకులు సత్తాను చాటుతున్నారు. మేం ఆస్కార్ వరకు వెళ్లాం. ఇండియా జాయ్ వారి గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఎంతో సహకరిస్తున్నారు. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ వంటి వారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకు రండి. మా అన్నపూర్ణ కాలేజ్‌లోనూ కోర్సులున్నాయి. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థాంక్స్’’ అని అన్నారు.
 
హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి చేస్తున్నారు
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘ఇండియా జాయ్ ఈవెంట్‌కు నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నాను. వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలు పట్టుకుని తిరిగాను. హాలీవుడ్‌లాంటి క్వాలిటీతో సినిమాలు ఎందుకు చేయరని అడుగుతుంటారు. కానీ గత పదేళ్లుగా అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు తీస్తున్నాం. హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి చేస్తున్నారు. ప్రాజెక్ట్ కేని పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మూవీలా ఇక్కడి వీఎఫ్ఎక్స్ కంపెనీలతోనే చేద్దామని ప్రయత్నించాను. నెక్ట్స్ మూవీని ఇక్కడి వాళ్లతో కలిసి హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో తీస్తాను’’ అని అన్నారు.
 
తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ ‘‘కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీ అంతగా అభివృద్ది చెందలేదు. ఆ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చాం. కొత్త విధానాలను తీసుకొచ్చాం. 2016లో తీసుకొచ్చిన పాలసీ ఎంతో దోహదపడింది. దేశంలో ఎన్నో పాలసీలుంటాయి కానీ ఆచరణలోకి రావని అంటారు. కానీ మన రాష్ట్రంలో పాలసీలను ఆచరణలోకి తీసుకొచ్చాం’’ అన్నారు.
 
కేకే సెంథిల్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి కార్యక్రమం ఇక్కడ జరగడం ఆనందంగా ఉంది. అన్ని రంగాల్లో హైద్రాబాద్ అభివృద్ది చెందుతోంది. సినిమాలు, వీఎఫ్ఎక్స్,యానిమేషన్ గురించి సినిమాటికా, ఇండియా జాయ్ కలిసి ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎంతో మందికి అవగాహన కల్పించినట్టు అవుతుంది’’ అని అన్నారు.
 
పి.జి.విందా మాట్లాడుతూ ‘‘సినిమాలు లేకుండా మన జీవితాలు లేవు. ఇండియా జాయ్ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలి. టెక్నాలజీ పరంగా ఇంకా అందరికీ అవగాహన కల్పించాలి. ఇక్కడకు వచ్చి అందరూ టెక్నాలజీ మీద అవగాహన పెంచుకోవాలి’’ అని అన్నారు.
 
కంట్రీ హెడ్ ఫర్ టెక్నికల్ బిరేన్ గోస్.. ‘హచ్ఐసీసీ సెంటర్‌లోని కార్యక్రమాల్లో గత పదకొండేళ్లుగా పాల్గొంటున్నాను. ఇండియా జాయ్ ఆరో సారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. పాలసీలను ఆచరణలో పెట్టడంలో తెలంగాణ అద్భుతంగా పని చేస్తోంది. మాకు ప్రభుత్వం నుంచి గొప్ప సహకారం అందుతోంది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీలు అన్నీ ఒకే ఇండస్ట్రీ అని ఇప్పుడు అందరికీ అర్థం అవుతోంది.’ అని అన్నారు.
 
రోటో మేకర్ ఫౌండర్ మైక్ మాట్లాడుతూ.. ‘ఇండియా జాయ్ ఆరో ఈవెంట్‌ను ఇంత గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇందుకు సహకరించిన కేటీఆర్, జయేష్ రంజన్ గారికి థాంక్స్. అంతర్జాతీయ స్థాయి నుంచి వక్తలు రాబోత్నారు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ గురించి చర్చలు జరగబోతోన్నాయి’ అని అన్నారు.
 
ఆశిష్ కులకర్ణి మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల నుంచి గేమింగ్, వీఎఫ్ఎక్స్, యానిమేషన్ ఇండస్ట్రీ అభివృద్ది చెందుతోంది. ప్రభుత్వ విధానాలు, కేటీఆర్, జయేష్ రంజన్ గారు ఎంతో సహకరించారు’ అని అన్నారు.
 
సరస్వతి వాణి మాట్లాడుతూ.. ‘మా తండ్రి గారు 1984లోనే యానిమేషన్ ప్రారంభించారు. ఆస్కార్ విన్ అవ్వాలని కోరుకున్నారు. నేను చిన్నప్పుడు ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను. లేడీ కాబట్టి వద్దని చాలా మంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వల్లే ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నామ’ని అన్నారు.