గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (19:41 IST)

ఇండియన్ ఇండస్ట్రీ సపోర్ట్ ఇచ్చింది - 500 కోట్ల గ్రాస్ కు చేరిన పుష్ప 2: అల్లు అర్జున్

Allu arjun
Allu arjun
పుష్ప 2 చిత్రం గ్రాండ్ సక్సెస్ మీట్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగింది. ఈ వేడుకలో చిత్ర నిర్మాతలు, దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ పాల్గొన్నారు. 
 
అల్లు అర్జున్ మాట్లాడుతూ, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాల్ ఫిలిం ఇండస్ట్రీ మంచి సపోర్ట్ పుష్ప 2కు ఇచ్చారు. రిలీజ్ టేడ్ కు అందరూ మంచి సహకారాన్ని అందించారు. సోలో రిలీజ్ గా విడుదల చేయడానికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద స్థాయిలో వెళుతోంది. ఈ సినిమా చేయడానికి తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుందని ఆశించి చేశాం. అలానే ఫీడ్ బ్యాక్ వచ్చింది. 
 
వార్తవినగానే మైండ్ బ్లాంక్ అయింది
నేను సంథ్య థియేటర్ కు గత 20 ఏళ్ళుగా వెళుతున్నాను. ఆడియన్స్ మధ్యలో చాలా సార్లు సినిమాలు చూశాను. కానీ అనుకోకుండా ఆరోజు సంఘటన జరిగింది. నేను థియేటర్ లో చూస్తుండగా, మేనేజ్ మెంట్ వచ్చి, సార్.. క్రౌండ్ చాలా వుంది. వెళ్ళిపోండని అన్నారు. తర్వాత నాకు తెలిసింది. ఓ ప్యామిలీ చూడడానికి వచ్చి రేవతి అనే ఆవిడ చనిపోయారనేగా మానసికంగా చాలా బాధపడ్డాను. స్థిమితం కావడానికి చాలా టైం పట్టింది. వార్త వినగానే మైండ్ బ్లాక్ అయింది. నేను సుకుమార్ కూడా చాలా బాధపడ్డాం. సినిమా కష్టపడి చేశాం. దానికి చూడడానికి వచ్చిన రేవతిగారికి అలా కావడం చాలా బాధాకరం. నేను 25లక్షలు వెంటనే ప్రకటించాను. వారి ఫ్యామిలీకి తగు విధంగా మరింతగా వారి కుటుంబాన్ని కలుస్తాను. వారి పిల్లలకు కానీ ఏదైనా కావాలనిపిస్తే నేను ముందుంటాను. 
 
500 కోట్లు గ్రాస్ దాటింది : నిర్మాత చెర్రీ
చెర్రీ మాట్లాడుతూ, పంపిణీదారుల నుంచి ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది. ఆల్ రెడీ  500 కోట్లకు రెండోరోజు చేరువయింది. ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇండియన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడిాగారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. డిఫ్యూటీ సి.ఎం. పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్, దుర్గేష్ గారికి ధన్యవాదాలు. సినిమాకు సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ ఓ విషయం గ్రహించాలి. ఒక్క రోజుకకే 800 పెంచాం. ఆ తర్వాత మామూలు రేటుకే సినిమా వుంటుంది అన్నారు.