ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు.. ఇదో అడల్ట్ మూవీ?
ప్రశాంత్, మహిధర్, ఇషిత, లలిత హీరోహీరోయిన్లుగా కె.వెంకటేష్ దర్శకత్వంలో బేబీ అముక్త సమర్పణలో లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశ్నాథ్ నిర్మిస్తున్న చిత్రం 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటా
ప్రశాంత్, మహిధర్, ఇషిత, లలిత హీరోహీరోయిన్లుగా కె.వెంకటేష్ దర్శకత్వంలో బేబీ అముక్త సమర్పణలో లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశ్నాథ్ నిర్మిస్తున్న చిత్రం 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు'. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
యువ ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఇటీవలే సెన్సార్‌బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికేట్ అందుకుందీ చిత్రం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ఓ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని దర్శకుడు వెంకటేష్ తెలిపారు. చాలాకాలం పాటు విడుదలకు నోచుకోలేని ఈ సినిమా త్వరలో ప్రేక్షకులను అలరిస్తుందని.. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని వెంకటేష్ వెల్లడించారు.
అయితే ఇదో అడల్ట్ మూవీ అంటూ టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఈ సినిమాలో రొమాన్స్‌ను పండించే సీన్లు పిచ్చ పిచ్చగా ఉన్నాయని టాలీవుడ్ జనం అంటున్నారు. సెన్సార్ ఈ సినిమాకు ఎ సర్టిఫికేట్ ఇచ్చిందంటూ కూడా టాక్ వస్తోంది.