శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (12:27 IST)

జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటికి రోడ్డు ప్రమాదం...

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరబండ వద్ద ఆగివున్న ఓ లారీని చలాకీ చంటి ప్రయాణిస్తున్న క్రెటా కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జవగా చంటికి స్వల్ప గాయాలయ్యాయి. జబర్దస్త్‌లో యాక్టర్‌గా పనిచేస్తున్న చలాకి చంటి విజయవాడ నుండి హైద్రాబాదుకు వెళ్తుండగా ఉదయం ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రుని కోదాడ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.