ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 17 జూన్ 2019 (14:37 IST)

శ‌ర్వానంద్‌కు గాయాలు.. స‌ర్జ‌రీ... అస‌లు ఏమైంది..?

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి రీమేక్ చిత్రం. ఇక గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం కోసం థాయిలాండ్‌లో స్కై డైవింగ్‌కు సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్న శర్వానంద్‌కు అనుకోకుండా గాయమైందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే అది పెద్ద గాయమేమి కాదని, ఆయన అతి త్వరలో కోలుకుని తిరిగి షూటిగ్‌లో పాల్గొంటారని చిత్ర బృందం తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక పోస్ట్ చేస్తూ తెలిపింది.
 
తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా రూపొందిన 96 మూవీకి అఫీషియల్ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుండగా, ఒరిజినల్ మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాగా చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. అయితే... శ‌ర్వానంద్‌ను గాయాలు అయిన త‌ర్వాత హైద‌రాబాద్ తీసుకువ‌చ్చేసారు. శ‌ర్వానంద్‌ను ప‌రీక్షించిన వైద్యులు స‌ర్జ‌రీ చేయ‌నున్నార‌ని తెలిసింది.