శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:28 IST)

జబర్దస్త్ షో ఆగిపోతుందా? మల్లెమాల ఏమంటుంది?

బుల్లితెరపై పాపులర్ అయిన జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం షూటింగ్‌లు ఆగిపోవడంతో సీరియల్స్‌కు కూడా బ్రేక్ పడింది. ప్పటివరకు స్టోర్ చేసి పెట్టిన ఎపిసోడ్స్‌ని ప్లే చేసిన ఛానల్స్ అన్ని.. కరోనా కారణం కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం త్వరలోనే మళ్లీ సీరియల్స్ పునః ప్రసారం అంటూ చెప్తున్నాయి. 
 
ఇక కామెడీ ప్రియులకి ఇష్టమైన జబర్దస్త్ ప్రోగ్రామ్‌కి కూడా కరోనా సెగ తగిలింది. నిన్నటివరకు జబర్దస్త్ ఫ్రెష్ ఎపిసోడ్స్‌ని ప్లే చేసిన ఈటివి నెక్స్ట్ వీక్ వరకు జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌ని ప్లే చేసేలానే ఉంది. ఇప్పటివరకు ముందే షూట్ చేసి పెట్టిన జబర్దస్త్ ఎపిసోడ్స్‌ని ప్రసారం చేసారు. ఇన్నేళ్ళలో జబర్దస్త్ ప్రోగ్రాంకి ఇంతవరకు అంతరాయం కలగలేదు. కానీ కరోనా కారణంగా జబర్దస్త్ ప్రోగ్రాం కూడా ఆగిపోయేలా ఉంది. 
 
ఇప్పటివరకు ఎలాగోలా ముందే ప్రోగ్రాం చేసి పెట్టుకున్న ఎపిసోడ్స్‌తో లాక్కొచ్చిన ఛానల్.. ఇకపై లేటెస్ట్ ఎపిసోడ్స్‌ని ప్లే చేయలేకపోవచ్చునని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఏప్రిల్ 14 నుండి లాక్ డౌన్ ఎత్తివేస్తే లేటెస్ట్ ఎపిసోడ్స్ షూట్ చేసి జబర్దస్త్‌కి ఎక్కడ అంతరాయం కలగకుండా మల్లెమాల చూడగలదని టాక్ వస్తోంది.